Golden Pan: ఒక్క కిళ్లీ ధర రూ. 600.. ఏమైనా బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..
Golden Pan: సాధారణంగా మీరు ఇప్పటి వరకు తిన్న కిళ్లీ (పాన్) ధర ఎంత ఉండి ఉంటుంది? ఎక్కువలో ఎక్కువ అంటే ఓ వంద లేదా రెండు వందల రూపాయలు అంటారా.? అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోయే ఓ పాన్ ధర ఏకంగా....
Golden Pan: సాధారణంగా మీరు ఇప్పటి వరకు తిన్న కిళ్లీ (పాన్) ధర ఎంత ఉండి ఉంటుంది? ఎక్కువలో ఎక్కువ అంటే ఓ వంద లేదా రెండు వందల రూపాయలు అంటారా.? అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోయే ఓ పాన్ ధర ఏకంగా రూ.600. అందులో అంతలా ఏముంటుంది.. ఏమైనా బంగారంతో చేస్తారా? అని ప్రశిస్తారా.? అవును నిజమే ఈ పాన్‌లో బంగారాన్నే ఉపయోగిస్తారు. నమ్మట్లేదా.. అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఢిల్లీలో ‘యమూస్ పంచాయత్’ అనే పేరుతో ఓ పాన్ షాప్‌ను నడిపిస్తున్నారు. అన్ని దుకాణాల్లో తాము సాధారణ పాన్‌నే తయారు చేస్తే వెరైటీ ఏముంటదనుకున్నారో ఏమో.. ఏకంగా బంగారం పూత పూసిన పాన్‌ను తయారు చేస్తున్నారు. పూర్తిగా డ్రై ఫ్రూట్స్‌తో రూపొందించిన స్వీట్‌తో తయారు చేసే ఈ పాన్‌పై రియల్ గోల్డ్‌తో తయారు చేసిన పేపర్‌ను అతికించి ఇస్తారు. బంగారం తింటే ఏం కాదా.? అనే సందేహం వస్తుంది కదూ! కానీ అలాంటి భయం లేకుండా నిర్భయం తినొచ్చని చెబుతున్నారీ దుకాణం యజమాని. దీంతో ఈ వెరైటీ పాన్‌ను రుచి చేయడానికి కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఇక పాన్ తయారీ ఎలా ఉంటుందో తెలియజేస్తూ షాప్ నిర్వహకురాలు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
బంగారు పాన్ తయారీ వీడియో..
View this post on Instagram
ఇదిలా ఉంటే ఈ పాన్ షాప్ కేవలం గోల్డ్ పాన్‌కే పరిమితం కాకుండా మరెన్నో రకరకాల పాన్‌లను తయారు చేస్తోంది. చాక్లెట్ పాన్, ఫ్లవర్స్ పాన్ ఇలా విభిన్న రుచుల్లో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అంతటితో ఆగకుండా తమ దుకాణంలో తయారు చేసే విభిన్న రకాల పాన్‌లను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం యమూస్ పంచాయత్ ఇన్‌స్టాగ్రామ్ పేజీని సుమారు 6 వేలమంది ఫాలో అవుతున్నారు. మరి ఈ షాపులో దొరికే కొన్ని రకాల పాన్‌లను ఓసారి చూడండి.
యమూస్‌లో లభించే విభిన్న రకాల పాన్‌లు..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Yogurt: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఇలా చేయండి.. భారీ ఉపశమనం పొందండి..
నిల్వ ఉంటాయని.. వీటిని ఫ్రిడ్జి లో పెడుతున్నారా… అవి విషం కంటే ప్రమాదమట..అవేంటో తెలుసుకోండి..!