లిక్కర్ షాపులో మద్యాన్ని కొనుగోలు చేసిన మందుబాబు.. ఇంటికెళ్లి బాటిల్ ఓపెన్ చేయగా ఊహించని సీన్..
లిక్కర్ షాపుకెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసిన ఓ మందుబాబు.. దాన్ని ప్రశాంతంగా ఇంటికి వెళ్లి తాగుదామనుకున్నాడు. కట్ చేస్తే..
లిక్కర్ షాపుకెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసిన ఓ మందుబాబు.. దాన్ని ప్రశాంతంగా ఇంటికి వెళ్లి తాగుదామనుకున్నాడు. ఆ క్రమంలోనే బాటిల్ మూత ఓపెన్ చేస్తుండగా.. అతడికి ఊహించని సీన్ ఎదురైంది. అతడికి బాటిల్‌లో చనిపోయిన కప్ప కనిపించడంతో దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన ఛతీస్‌గడ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
కోర్బా జిల్లాలోని హార్దీ బజార్‌లో ఉన్న మద్యం షాపు నుంచి ఓ వ్యక్తి రూ. 300 దేశీయ మందు బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి ప్రశాంతంగా దాన్ని తాగుదామని.. ఆ బాటిల్ మూత ఓపెన్ చేశాడు. లోపల అతడికి ఓ చనిపోయిన కప్ప కనిపించింది. అది చూడగానే బెదిరిపోయిన సదరు వ్యక్తి.. మద్యం దుకాణానికి వెళ్లి అక్కడి సేల్స్‌మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడు ఆ వ్యక్తికి మరో కొత్త మద్యం బాటిల్ ఇచ్చాడు.
అయితే ఈలోపే అక్కడ జనం గుమిగూడి ప్రశ్నలు లేవనెత్తారు. గోదాం నుంచి షాపునకు వచ్చేవి సీల్డ్ మద్యం బాటిల్స్ అయితే.. ఇలాంటి తప్పులు ఎలా దొర్లుతున్నాయని ప్రశ్నించారు. గోదాం నుంచి వచ్చే ప్రతీ సరుకును తనిఖీ చేసి వినియోగదారులకు అందిస్తామని.. మునుపెన్నడూ ఇలాంటి ఘటనలు తలెత్తలేదని.. ఇకపై మరోసారి జరగకుండా చూసుకుంటామని షాప్ నిర్వాహకులు చెప్పారు.