Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దినఫలాలు (అక్టోబర్ 11, 2013): మేష రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 11th October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 11, 2023 | 5:01 AM

దినఫలాలు (అక్టోబర్ 11, 2013): మేష రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అవు తుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఆదాయ మార్గాల్లో మెరుగుదల కనిపిస్తుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం చాలావరకు ఆనందంగా సాగి పోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు బలం బాగా అనుకూలంగా ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో ఇబ్బందులను, సమస్యలను అధిగమిస్తారు. అనవసర పరిచయాలు పెట్టుకోవద్దు. మిత్రుల వల్ల సంపాదనలో కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అవసరా నికి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. ప్రయాణాలో డబ్బు వృథా అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా శ్రమ పెరుగు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ వసూలు అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. అయితే, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగి పోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సం తృప్తికర వాతావరణం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆటంకాలు, అవరో ధాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తల్లితండ్రుల నుంచి అండ దం డలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహబలం బాగుంది. చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

లాభస్థానం బాగా పటిష్టంగా ఉంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు బాగా తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయగలుగు తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. పిల్లల పురోగతికి సంబంధించి సరైన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా చాలావరకు కోలుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవు తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూ లంగా ఉంటుంది. ఆలయాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వాతా వరణం అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆరోగ్య భంగమేమీ ఉండకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్నేహి తుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాలలో ‍స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కొత్త వస్తు లాభాలకు అవకాశం ఉంది. అను కున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!