Funny Video: ఏందివయా గట్ల చూస్తున్నవ్.. పాండాతో ఫన్ మామూలుగా ఉండదు మరి..! వీడియో చుస్తే అంతే..
Panda Stunts Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ మస్తీ చేస్తాయి. ఇక జంతువులతో పాండా విషయానికి వస్తే..
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ మస్తీ చేస్తాయి. ఇక జంతువులతో పాండా విషయానికి వస్తే.. ఫన్ మామూలుగా ఉండదు. అవి చేసే అల్లరి పనులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా పాండాకు సంబంధించిన అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ పాండా చేస్తున్న అల్లరికి నెటిజన్లు అంతా ఫిదా అయిపోతున్నారు.
ఇంతకు ఆ పాండా ఏం చేసిందో చూద్దాం.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పార్క్ లో రెండు పాండాలు ఉన్నాయి. ఒక పాండా అటు ఇటు తిరుగుతూ ఉంటే.. మరొక పాండా మాత్రం తెగ అల్లరి చేస్తుంది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.. దానికి ఒక కర్ర దొరికింది. ఆ కర్రకు గట్టిగా హత్తుకుని నానా హంగామా చేసింది. ఆ కర్రను పట్టుకుని.. నేలపై బొర్లుతూ ఎంజాయ్ చేసింది. ఈ పాండా ఇలా వింతగా చేస్తుండటంతో.. మరో పాండా షాక్ లో ఏంటిది ఇలా చేస్తుంది అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది. దాని చూపు.. ఈ పాండాకు రియాక్ట్ అయ్యింది. నా లైఫ్ నా ఇష్టం.. ఏంటి అలా చూస్తున్నావ్ అన్నట్లుగా ఇది కూడా ఓ లుక్కేసింది. ఆ లుక్కుకి బెదిరిపోయిన మరో పాండా.. తన దారిన తను వెళ్ళిపోయింది. కాగా.. ఈ ఫన్నీ దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. అది కాస్తా వైరల్ గా మారింది. పాండా అల్లరిని చూసి నెటిజన్లు.. ఫిదా అయిపోతున్నారు. మరెందుకు లేట్.. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయ్యండి.
Kung Fu panda is real…. pic.twitter.com/tda5xnaDEw
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) March 10, 2022
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..