Robert Crowleyin: భారత అణుశాస్త్రవేత్త హోమీ బాబా, లాల్ బహదూర్ శాస్త్రి హత్యల వెనుక CIAనే.. రాబర్ట్ క్రౌలీ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడి

హోమీ జహంగీర్ భాభా, లాల్ బహదూర్ శాస్త్రి లను అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే హత్య జరిగినట్లు రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో పేర్కొన్నాడు. హత్యలు జరిగే సమయంలో CIA డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతను రాబర్ట్ నిర్వహించేవారు. రాబర్ట్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన సంభాషణ పుస్తక రూపంలో వెలువడింది.

Robert Crowleyin: భారత అణుశాస్త్రవేత్త హోమీ బాబా, లాల్ బహదూర్ శాస్త్రి హత్యల వెనుక CIAనే.. రాబర్ట్ క్రౌలీ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడి
Robert Crowley

Updated on: Jul 19, 2022 | 1:23 PM

Robert Crowleyin: భారతీయ శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హత్యల్లో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) పాత్ర ఉందనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తున్నదే. అయితే ఇరువురి హత్యల గురించి అమెరికా ప్రఖ్యాత రచయిత గ్రెగొరీ డగ్లస్ తన ‘ కాన్వర్సేషన్ విత్ ది క్రో ‘ పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించారు. హోమీ జహంగీర్ భాభా, లాల్ బహదూర్ శాస్త్రి లను తమ ఆధ్వర్యంలోనే హత్య జరిగినట్లు రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో పేర్కొన్నాడు. హత్యలు జరిగే సమయంలో CIA డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతను రాబర్ట్ నిర్వహించేవారు. రాబర్ట్ స్టేట్మెంట్.. పుస్తక రూపంలో వెలువడింది.

గోవులను ప్రేమించే భారతీయులు తాము ఎంత తెలివైన వారని..  ప్రపంచంలో గొప్ప శక్తిగా మారబోతున్నామని గొప్పగా చెప్పుకుంటారని. తాము భారతీయులు స్వయం సంవృద్ధి సాధించాలని కోరుకోలేదని రాబర్ట్ క్రౌలీ తన తన రికార్డ్ లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

హోమీ భాభా మరణించిన సమయంలో..  అతను వియన్నా వెళ్తున్నారని రాబర్ట్ చెప్పాడు. హోమీ భాభా వెళ్తున్న విమానం ఎయిర్ ఇండియాకు చెందిన కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అని రాబర్ట్ తెలిపారు. నేను అతని మరణం గురించి.. విమానంలో ప్రయాణీకుల గురించి చింతించలేదు. ఎందుకంటే ఆ విమానంలో నా స్వంత మనుషులు ఉంటే నేను బాధపడతాను. వియన్నాలోనే హత్య చేయవచ్చు.. కానీ మేము ఎత్తైన పర్వతాన్ని ఎంచుకున్నాం.. ఎందుకంటే విమానం విస్ఫోటనం తర్వాత అది ముక్కలు అవ్వడానికి మంచి ప్రదేశం అని మేము నిర్ణయించుకున్నామని పేర్కొన్నాడు.

ఆసియాలో వరి సాగును నాశనం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన CIA 
రాబర్ట్ తన ప్రకటనలో, లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆవు ప్రేమికుడే. వీరి గురించి మీకు తెలియదు.. భారతీయులు స్వయంగా బాంబును తయారు చేసేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు.. భారతీయులు తమ శత్రువైన పాక్ పై దాడి చేస్తే.. అంటూ తాము ఆలోచించినట్లు పేర్కొన్నారు రాబర్ట్. అంతేకాదు ఆసియాలో వరి సాగును పూర్తిగా నాశనం చేసే వ్యాధిని కూడా అభివృద్ధి చేసామని.. ఆ వ్యాధి సహాయంతో ఆసియా పటం నుండి బియ్యం తీసివేయాలని కోరుకున్నామని సంచలన విషయాలను వెల్లడించారు. ఇలా వరి పంటను ఎందుకు నాశనం చేయాలనుకున్నామంటే.. అక్కడి ప్రజల ప్రధాన ఆహారం వరి.. బియ్యం లేకపోతె.. ఆసియాలోని ప్రజలు ఆకలితో అలమటించి మరణిస్తారని తాము అంచనా వేసినట్లు తెలిపాడు.

ట్విట్టర్‌లో షేర్ అవుతున్న రాబర్ట్ ప్రకటన  

డాక్టర్ హోమీ జహంగీర్ భాభా భారత అణు కార్యక్రమానికి పితామహుడు. భారతదేశంలో అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్‌ను రూపొందించిన వ్యక్తి. అంతేకాదు అణు శక్తిని పెంపొందించుకునేలా అవసరమైన అనేక చర్య తీసుకున్నారు. హోమీ భాభా వేసిన పునాదితోనే భారతదేశానికి అణుశక్తిని కలిగి ఉండే మార్గం ఏర్పడింది.

అక్టోబరు 30, 1909న ముంబైకి చెందిన పార్సీ కుటుంబానికి చెందిన హోమీ భాభా తండ్రి జహంగీర్ భాభా సుప్రసిద్ధ న్యాయవాది. హోమీ భాభా ప్రాధమిక విద్యాభ్యాసం ముంబైలోని కేథడ్రల్ స్కూల్, జాన్ కానన్ స్కూల్‌లో జరిగింది. అతనికి మొదటి నుంచీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ప్రత్యేక ఆసక్తి. రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి B.Sc చేసిన తరువాత.. ఉన్నత చదువుల కోసం 1927లో ఇంగ్లండ్ వెళ్ళాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

భాభా జర్మనీలో కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశారు. వాటిపై అనేక ప్రయోగాలు కూడా చేశారు. చదువు పూర్తయ్యాక..  1939లో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరారు. శాస్త్రీయ సంగీతం, శిల్పం, పెయింటింగ్ , నృత్యంపై కూడా చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ .. కూడా హోమీ భాభాను భారతదేశానికి చెందిన లియోనార్డో డా విన్సీ అని ముద్దుగా పిలిచేవారు.

మనదేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత  1957 సంవత్సరంలో..  ముంబైకి సమీపంలోని ట్రాంబేలో మొదటి అణు పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 1967లో దీనిని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. జనవరి 24, 1966 న విమాన ప్రమాదంలో హామీ భాభా మరణించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..