Optical Illusion: స్నోమెన్ల మధ్య దాగివున్న పొలార్ బేర్‌ని 8 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో స్నోమెన్‌ల మధ్య పొలార్ బేర్ దాగి ఉంది. దానిని 8 సెకన్లలో గుర్తించమని సవాలు చేస్తోంది. పొలార్ బేర్ పూర్తిగా స్నోమెన్‌లతో కలిసిపోయి ఉండటం వల్ల కనుగొనడం కాస్త కష్టంగా ఉంటుంది. అయితే పూర్తిగా దృష్టి పెట్టి చూసి ఈ పజిల్‌ను పరిష్కరించవచ్చు.

సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న మరో ఆప్టికల్ ఇల్యూషన్ తో మీ ముందుకు ఇలా. ఆప్టికల్ ఇల్యూషన్‌లు మన మెదడుని, ఊహాశక్తిని మోసం చేస్తూ.. వాస్తవానికి లేని విషయాలను ఉన్నట్లు అనిపించే చిత్రాలు. కొన్ని ఇల్యూషన్‌లు త్వరగా పరిష్కరించవచ్చు, కానీ కొన్ని సార్లు అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
కొన్ని చిత్రాలు మొదట చూస్తే, ఒక స్పష్టమైన ఆకారం లేదా దృశ్యం కనిపించవచ్చు. కానీ ఆ ఫోటోను మరోసారి గమనించి బాగా పరిశీలిస్తే, మొదట కనిపించిన దృశ్యం నిజంగా అలాంటిదా అనిపిస్తుంది. ఈ చిత్రాలు కంటి చూపును పరీక్షించడంలో ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాదు, ఇవి మరింత సవాళ్లతో కూడిన దృశ్యాలను, రహస్యాలను దాచిపెడతాయి. ఆ రహస్యాలను గుర్తించగలిగిన వారికి నిజంగా మంచి కంటి చూపు ఉందని అనిపించకమానదు.

ప్రస్తుతం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నో ఇల్యూషన్లను గుర్తించిన నెటిజన్లు దీన్ని గుర్తించలేకపోయారు. ఇప్పుడు చూపిస్తున్న ఈ చిత్రం మీకు స్నోమెన్‌ల మధ్య ఒక పొలార్ బేర్‌ను కనుగొనమని సవాలు చేస్తోంది. కేవలం 8 సెకన్లలోపే కనుగొనాలి. పొలార్ బేర్ స్నోమెన్‌ల మధ్య పూర్తిగా కలిసిపోయి ఉంది. కనుగొనడం కొంచం కష్టమే కాని ట్రై చేయండి.
మరోసారి ఈ చిత్రంపై పూర్తి దృష్టి పెట్టి చూడండి. మరి అంత కష్టమైన టాస్కేమి కాదు. కొంచం కష్టం కొంచం ఈజీగా ఉంటుంది. ఛాలెంజ్ గా తీసుకోని చూడండి వెంటనే కనిపెట్టేస్తారు. చిత్రంలో పోలార్ బేర్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఇంకా కనిపించడం లేదా.. అలానే చూస్తు స్ట్రక్ అయిపోయారా..? సరే అయితే జవాబుకు సంబంధించిన ఫొటోని చూడండి. ఇదిగో ఇక్కడే ఉంది పొలార్ బేర్.





