Beauty Tips: ఇంట్లోనే అందుబాటులో ఉండే పాలతో చర్మాన్ని మెరిసేలా మార్చండి..!
మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా మార్చుకోవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే అందుబాటులో ఉండే పచ్చి పాలను ఉపయోగించడం వల్ల మీరు రసాయనాల క్రీమ్స్ అవసరం లేకుండానే మంచి ఫలితాలు పొందవచ్చు. పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్, విటమిన్స్, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.
Updated on: Jan 25, 2025 | 8:33 PM

ఫేస్ మాస్క్ కి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ పసుపు. పాలు, తేనె, పసుపు కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా రాయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం హైడ్రేట్ అవుతుంది. పైగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అలాగే పసుపు వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.

అరటిపండు మాస్క్ కి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, 1 అరటిపండు. అరటిపండును గుజ్జులా చేసి అందులో పచ్చిపాలు కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగండి. ఈ మాస్క్ చర్మానికి మాయిశ్చరైజేషన్ అందిస్తుంది. చర్మం మృదువుగా మారి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

రా మిల్క్ టోనర్ కి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఇప్పుడు పచ్చిపాలు, రోజ్ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో కలిపి బాగా షేక్ చేయండి. ఈ టోనర్‌ను ముఖానికి స్ప్రే చేసి 10 నిమిషాల తరువాత కడగండి. ఈ టోనర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చర్మం హైడ్రేట్ అయ్యి కొత్త ఉత్తేజాన్ని పొందుతుంది.

ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్ కి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదా ఓట్స్ పిండి తీసుకొని అందుబాటులో ఉంచండి. ఇప్పుడు పచ్చిపాలలో బియ్యం పిండి లేదా ఓట్స్ పిండి కలిపి పేస్ట్ తయారు చేసి ముఖంపై రాయండి. సర్క్యూలర్ మోషన్‌లో 5 నిమిషాలు స్క్రబ్ చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. దీని వల్ల మృతకణాలు తొలగి చర్మం స్మూత్‌గా, ప్రకాశవంతంగా మారుతుంది.

పచ్చిపాలను క్లెన్సర్ గా వాడడానికి కావాల్సినవి.. 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, కాటన్ బాల్. ఇప్పుడు కాటన్ బాల్‌ని పచ్చిపాలలో ముంచి ముఖంపై సర్క్యూలర్ మోషన్‌లో రాయండి. ఇది 10 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి కణాలు పూర్తిగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.




