
భారతదేశంలో రైలు ప్రయాణం చాలా మందికి చవకైన రవాణా సాధనం. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా రైల్వేల్లో కూడా గణీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ వద్ద క్యూలైన్స్‌కు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ-టిక్కెటింగ్ విధానం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి టిక్కెట్‌పై వేరొకరు ప్రయాణించవచ్చా? అనేది చాలా మందికి పెద్ద అనుమానంగా ఉంటుంది. ఇటీవల భారతీయ రైల్వే ఇ-టికెట్‌ను బుక్ చేసి, పొరపాటు కారణంగా ప్రయాణీకుడి పేరును మార్చాల్సి వస్తే లేదా కుటుంబ సభ్యుల పేరు తప్పుగా నమోదు చేస్తే సాంకేతికత దిద్దుబాటు ప్రక్రియను సులభతరం చేసింది. ఈ సేవకు సంబంధించి ఐఆర్‌సీటీస వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు ఎర్రర్లను ఎదుర్కొన్నా లేదా మీ కుటుంబంలో బుక్ చేసిన టిక్కెట్ను బదిలీ చేయాలనుకున్నా ఇటీవల ఐఆర్‌సీటీసీ ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీ ప్రయాణీకులు తమ టిక్కెట్లను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్యతో సహా కుటుంబ సభ్యునికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రయాణికులు ఈ సాధారణ దశలను అనుసరించాలి టికెట్‌కు సంబంధించినప ప్రింట్ అవుట్‌ను, ప్రస్తుత ప్రయాణీకుల అసలు ఐడీ రుజువును సమర్పించాలి. రిజర్వేషన్ డెస్క్ వద్ద కొత్త ప్రయాణికుడితో రక్త సంబంధానికి సంబంధించిన రుజువును అందించాలి. ఈ సరళమైన విధానం ఐఆర్‌సీటీసీ సేవలకు అనుకూలమైన ఫీచర్‌ను జోడిస్తూ, కుటుంబంలో టిక్కెట్లను సజావుగా బదిలీ చేయవచ్చు.
మీ టిక్కెట్ను బదిలీ చేయడానికి మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందుగా మీ అభ్యర్థనను సమర్పించాలి. అయితే రాయితీపై జారీ చేసిన టిక్కెట్లపై పేర్ల మార్పు అనుమతించరు.
బదిలీ అంటే రైల్వే సర్వెంట్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని మార్చడం. అలాగే బదిలీ తాత్కాలికమైనప్పుడు బదిలీ ఆర్డర్లో అదే పేర్కొనాలి. అటువంటి సందర్భాల్లో ఉద్యోగి 180 రోజుల వ్యవధిలో టీఏ/డీఏకు అర్హులు, ఆ తర్వాత బదిలీ శాశ్వతంగా మారుతుంది.
మీరు ఐఆర్‌సీటీసీ నుంచి నిర్ధారణను స్వీకరించిన తర్వాత, మీరు మీ టిక్కెట్‌కుఅవసరమైన మార్పులను చేయవచ్చు. ఇది ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా కస్టమర్ కేర్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా చేయవచ్చు. మార్పులు చేయడానికి మీరు మీ టిక్కెట్ నంబర్, నిర్ధారణ ఈ-మెయిల్‌ను అందించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..