మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువగా ఉంటారు. బంగారం అంటే ప్రతి ఒక్కరికీ మహా ప్రీతి. వేడుక ఏదైనా సరే, ఆడ మగ తేడా లేదు.. ఒంటి నిండా బంగారం నగలు ధరించి ధగధగలాడిపోతారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కానీ, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు బంగారాన్ని ధరించకూడదో తప్పక తెలుసుకోవటం మంచిది..ఆ వివరాల్లోకి వెళితే..
బంగారం అందాన్ని పెంచడమే కాకుండా బంగారం ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కానీ, కొంతమంది బంగారం ధరించకూడదు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం అశుభంగా పరిగణిస్తారు. వృషభం, వృశ్చికం, మిథునం, కుంభం రాశుల వారు బంగారం ధరించకపోవడమే ఉత్తమం. కుంభ రాశికి శని అధిపతి. అందువల్ల వీళ్ళు బంగారం ధరిస్తే వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
వృషభం: వృషభ రాశివారికి బంగారం శత్రువు లాంటిదట. వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టినవారు బంగారాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయట. ఉద్యోగం, వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయట. సంబంధ, బంధవ్యాలు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశి: మిథున రాశిలో పుట్టిన వారికి కూడా బంగారం పడదు. వీరు తెలీక వేసుకున్నా కూడా ఆర్థిక సమస్యలు వెంటాడతాయట.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు బంగారానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృశ్చిక రాశికి బంగారం శత్రువులాంటిదని ఆస్ట్రాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుంభ రాశి: సూర్యుడు, శని గ్రహాలు కుంభ రాశివారికి అధిపతులుగా చెబుతారు. వీరు ఎలాంటి బంగారు ఆభరణాలను వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుందట. అందుకే కుంభరాశి వారు బంగారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.