Police Challan: మీ వాహనానికి పదే పదే చలాన్ పడుతోందా? ఈ 3 పనులు చేస్తే ఇక అస్సలు ఫైన్ పడదు..!

వాహనదారులు అత్యవసర పనుల నేపథ్యంలోనో, తొందరలోనో, ఉద్దేశపూర్వకంగానో ట్రాపిక్ నియమాలను ఉల్లంఘిస్తుంటారు. దాని ఫలితంగా.. పోలీసులు వారి వాహనాలకు చలాన్లు పంపుతుంటారు. ఆ కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. జేబు అంతా ఖాళీ అవడం ఖాయం. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ, డాక్యూమెంట్స్ లేకపోవడం,

Police Challan: మీ వాహనానికి పదే పదే చలాన్ పడుతోందా? ఈ 3 పనులు చేస్తే ఇక అస్సలు ఫైన్ పడదు..!
Car Driving

Updated on: May 21, 2023 | 4:04 PM

వాహనదారులు అత్యవసర పనుల నేపథ్యంలోనో, తొందరలోనో, ఉద్దేశపూర్వకంగానో ట్రాపిక్ నియమాలను ఉల్లంఘిస్తుంటారు. దాని ఫలితంగా.. పోలీసులు వారి వాహనాలకు చలాన్లు పంపుతుంటారు. ఆ కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. జేబు అంతా ఖాళీ అవడం ఖాయం. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ, డాక్యూమెంట్స్ లేకపోవడం, బైక్ అయితే వితౌట్ హెల్మెట్ లేకవడం వంటి కారణాలతో చలాన్లు విధిస్తారు పోలీసులు. వాస్తవానికి ఈ ట్రాఫిక్ రూల్స్ మన భద్రత కోసమే రూపొందించడం జరిగింది. కానీ, చాలా మంది ఆ నిబంధనలను అదేదో తమపై బలవంతంగా రుద్దుతున్నట్లుగా భావిస్తూ, అనుసరిస్తారు. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి అపాయానికి గురికాకుండా, క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. లేదంటే.. ఎలాంటి దుర్ఘటన అయినా జరిగే అవకాశం ఉంది. అయితే, ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు రాకుండా ఉండాలంటే వాహనదారులు ముఖ్యంగా 3 పనులు చేయాలి. అవి చేస్తే.. ఇక ఎప్పటికీ చలాన్లు రావు. పైగా ప్రశాంతంగా మీరు మీవాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. మరి ఆ 3 పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సిగ్నల్ జంప్ వద్దు..

కారు అయినా, బైక్ అయినా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ దృష్టి రోడ్డువైపే ఉండాలి. రోడ్డుపై కనిపించే ప్రతి బోర్డు, సిగ్నల్ చూస్తూ నడపాలి. ఎంట్రీ, నో ఎంట్రీ, యాక్సిడెంట్ ఏరియా, స్పీడ్ లిమిట్ సహా కీలక సమాచారంతో కూడిన బోర్డ్స్ ఉంటాయి. అందుకని, రోడ్డును గమనిస్తూ వాహనాన్ని నడపాలి. వాటిని అనుసరిస్తూ డ్రైవింగ్ చేస్తే ఎలాంటి చలాన్ పడదు. ముఖ్యంగా సిగ్నల్ క్రాస్ చేయకుండా ఉండాలి. అలా చలాన్ నుంచి తప్పించుకోవచ్చు.

డాక్యూమెంట్స్ ఉండాలి..

ట్రాఫిక్ పోలీసులకు చిక్కకూడదు, చలాన్ పడకూడదు అనుకుంటే.. వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, ఇన్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, మీ డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని డాక్యూమెంట్స్ దగ్గర ఉంచుకోవాలి. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా, ఎక్కడైనా ఆపి తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైన పత్రాలు వెంట ఉంటే.. వారికి చూపించి చలాన్ భారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో డిజిటల్ కార్డ్స్ కూడా ఆమోదిస్తున్నారు. మొబైల్‌లోనూ ఈ డాక్యూమెంట్స్‌ను భద్రపరుచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కారు/బైక్ డిజైన్ మార్పు చేసే ముందు రూల్స్ తెలుసుకోవాలి..

చాలా మంది తమకు నచ్చిన విధంగా కారు, బైక్ డిజైన్ మార్చుకుంటారు. అయితే, అదే వారి కొంప ముంచుతుంది. రూల్స్ తెలియక తమకు నచ్చిన విధంగా, స్టైల్‌గా మోడిఫై చేయించుకుంటారు. అయితే, వాహనంలో మార్పులు చేయడం వల్ల ట్రాఫిక్ చలాన్ పడే అవకాశం ఉంది. వాల్యూమ్ ఎగ్జాస్ట్‌కు బ్లాక్ మిర్రర్‌లు పెట్టడం, ఎక్కువ హారన్ సౌండ్ పెట్టడం, లైట్ డిజైన్లు భిన్నంగా పెట్టడం చేస్తారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తారు. అందుకని, మీ వాహనాన్ని మోడిఫై చేసుకునే ముందు.. నిబంధనలను తెలుసుకోవడం తప్పనిసరి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..