ఇంగువ ఒక రకమైన మసాలా దినుసు. దీనిని జోడించడం వలన కూరగాయలు, పప్పులకు అదనపు రుచి లభిస్తుంది. భారతీయ వంటగదిలో ఇంగువకు ముఖ్యమైన స్థానం ఉండడానికి ఇదే కారణం. అంతేకాదు ఇంగువలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇంగువను తినే ఆహారంలో జోడించడం వలన తిన్న ఆహారం జీర్ణం అవుతుందని విశ్వాసం అంతేకాదు ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఇంగువ సాగు చేస్తే లాభాలను సొంతం చేసుకోవచ్చు.
భారతీయములకు కావాల్సిన ఇంగువను కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నా ఎక్కువ మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్ , లడఖ్‌లలో రైతులు అసిఫెటిడాను(ఇంగువ)ను సాగు చేస్తున్నారు. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతులు కూడా ఇంగువ సాగు చేసే దిశగా ఆలోచన చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. అయితే ఇంగువ సాగు చెయ్యాలంటే ముఖ్యంగా చల్లటి వాతవరణం కావల్సి ఉంటుంది. దీంతో వేడి ప్రాంతాల్లో కూడా ఇంగువ సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తద్వారా దీనిని వేడి ప్రాంతాలలో సాగు చేయవచ్చని చెబుతున్నారు.
కిలో ఇంగువ కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే..
ఇంగువ సాగుకు ఇసుక, బంక మన్ను నేల ఉత్తమంగా పరిగణించబడుతుంది. రైతు సోదరులు ఇసుక, బంకమట్టిలో ఇంగువ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. రైతు ఇంగువ సాగు చేస్తున్న పొలంలో నీటి ఎద్దడి ఉండకూడదు. పొలంలో నీటి ఎద్దడి ఉంటే ఇంగువ మొక్కలు దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఇంగువ ధర 35 నుంచి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. రైతు సోదరులు ఒక ఎకరంలో ఇంగువ సాగు చేస్తే భారీగా ఆదాయాన్ని పొందవచ్చు.
భారత్ లోనే అత్యధిక ఇంగువ వినియోగం..
ఒక లెక్క ప్రకారం ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వినియోగించేది భారతదేశంలోనే. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఇంగువలో 40 నుండి 50 శాతం భారతదేశంలోనే వినియోగిస్తున్నారు. అయితే మనదేశంలో ఇంగువ సాగు విషయాన్నీ వస్తే.. అంతంతమాత్రమే అని చెప్పవచ్చు.
దీంతో డిమాండ్ కు తగిన సప్లై లేకపోవడంతో ఇంగువను విదేశాల నుంచి దిగుమతి చేస్తారు. భారతదేశం ప్రతి సంవత్సరం 1200 టన్నుల ముడి ఇంగువ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.600 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన రైతులు ఇంగువను సాగు చేయడం ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా లాభాలను అందుకుంటారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..