Gambling addiction: డ‌బ్బు సంపాద‌న కోసం జూదానికి అల‌వాటు ప‌డ్డారా.. మీ లైఫ్ రిస్క్ లో ప‌డిన‌ట్లే..  

డ‌బ్బు సంపాద‌న జీవితంలో ఒక భాగం.. కాని డ‌బ్బు సంపాద‌న జీవితం కాదు. చాలా మంది సులువుగా డ‌బ్బు సంపాదించడం కోసం జూదాన్ని ఎంచుకుంటారు. ఈ మోజులో బంగారం లాంటి భ‌విష్య‌త్తును రిస్క్ లో పెడ‌తారు. తొలుత స‌రదాగా..

Gambling addiction: డ‌బ్బు సంపాద‌న కోసం జూదానికి అల‌వాటు ప‌డ్డారా.. మీ లైఫ్ రిస్క్ లో ప‌డిన‌ట్లే..  
Gambling
Follow us

|

Updated on: Sep 29, 2022 | 4:42 PM

డ‌బ్బు సంపాద‌న జీవితంలో ఒక భాగం.. కాని డ‌బ్బు సంపాద‌న జీవితం కాదు. చాలా మంది సులువుగా డ‌బ్బు సంపాదించడం కోసం జూదాన్ని ఎంచుకుంటారు. ఈ మోజులో బంగారం లాంటి భ‌విష్య‌త్తును రిస్క్ లో పెడ‌తారు. తొలుత స‌రదాగా అనిపించినా, కొద్దిరోజుల‌కు జూదానికి బానిస‌లు అయిపోతారు. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా జూద క్రీడ‌లు రావ‌డంతో చాలామంది యువ‌త ఆన్ లైన్ జూదాల‌కు అల‌వాటుప‌డుతున్నారు. జూదానికి బానిస‌లై ఆస్తులు అమ్ముకున్న వారు కోకొల్ల‌లు. బెట్టింగ్, ర‌మ్మీ, క్యాసినో వంటి జూద క్రీడ‌ల‌కు అల‌వాటుప‌డి,  ఆర్థికంగా న‌ష్ట‌పోయి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.  జూద క్రీడలకు అలవాటు పడిన వారి మన‌సు కూడా ప్ర‌శాంతంగా ఉండ‌దు. జూదానికి అల‌వాటుప‌డిన వారు డ‌బ్బులు లేక‌పోతే అప్పులు చేసైనా జూదం ఆడుతూ ఉంటారు. దీనివ‌ల్ల ఆర్థికంగా చికతికిపోవ‌డ‌మే కాకుండా భారీగా అప్పుల పాలవుతారు. రోజంతా క‌ష్టంచేసి సంపాదించిన ఆదాయం క్ష‌ణాల్లో జూదంలో న‌ష్ట‌పోతూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తారు చాలామంది.

జూదం అనేది మ‌న అదృష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది.. అందుకే మ‌న‌కు అదృష్టం ఉంటే మ‌న డ‌బ్బు రెట్టింపు అవుతుంది. కొన్ని సార్లు ల‌క్షాధికారులం, కోటీశ్వ‌రులం అయిపోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో జూదం వైపు అడుగులు వేస్తారు. అయితే మ‌నం నిజంగా అదృష్ట‌వంతులం అయిన‌ప్ప‌టికి జూద క్రీడ‌లో అదృష్టాన్ని న‌మ్ముకోవ‌డం మ‌న అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. కొన్ని జూద క్రీడ‌ల్లో మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుంది. మ‌రి కొన్ని క్రీడ‌ల్లో మ‌నం స‌రైన అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు క్రికెట్ లేదా  ఫుట్ బాల్ లాంటి క్రీడ‌ల్లో ఈ ఓవ‌ర్ లో టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది.. ఒక బ్యాట్స్ మెన్ ఎంత స్కోర్ చేస్తాడ‌నేది బౌలింగ్ వేసే వ్య‌క్తి, పిచ్ పరిస్థితులు, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఇలా అనేక అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. లూజ్ బాల్ దొరికితే ఎక్కువ స్కోర్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఒక్కో సారి అదే బాల్ కు అవుట్ కూడా కావ‌చ్చు. కాని మ‌నం మ‌న‌కు తోచిన విధంగా ఒక అంచ‌నా వేసి బెట్టింగ్ కు పాల్ప‌డ‌తాము. అలా చేయ‌డం ద్వారా మ‌న డ‌బ్బులు చాలా సంద‌ర్భాల్లో న‌ష్ట‌పోతూ ఉంటాం. అందుకే జూదానికి వీలైనంత దూరంగా ఉండ‌టం మంచిది.

జూదంలో డ‌బ్బులు సంపాదించ‌డం అనేది ఒక ర‌కంగా అత్యాశే అవుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం డ‌బ్బులు గెల‌వ‌వ‌చ్చు. చివ‌రికి జూదానికి బానిస కావ‌డం ద్వారా లేని పోని టెన్ష‌న్ తెచ్చుకుని, త‌మ‌ జీవితాన్ని నాశ‌నం చేసుకుంటూ ఉంటారు. ఒక జ్యూవెల‌రీ షాపుకు సంబంధించిన యాడ్ లో డ‌బ్బులు ఎవ‌రికైనా ఊరుకునే రావు క‌దా అని అంటుంటారు.. ఇది అక్ష‌ర స‌త్యం. మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును క్ష‌ణాల్లో జూద క్రీడ‌ల్లో పెట్టి పొగొట్టుకుంటూ ఉంటాం. ఎంతో క‌ష్ట‌పడి సంపాదించిన డ‌బ్బు ఊరుకునే పొగొట్టుకుని బాధ‌ప‌డుతూ ఉంటారు. అదే డ‌బ్బులు సంపాదించాలంటే చాలా క‌ష్టం. ఏదైనా సాధించ‌డం క‌ష్టం. పొగొట్టుకోవ‌డం సుల‌భం.. మంచి పేరు తెచ్చుకోవ‌డం చాలా కష్టం.. చెడ్డ పేరు తెచ్చుకోవ‌డం మాత్రం క‌ష్టం కాదు. అందుకే జూద క్రీడ‌ల‌కు అల‌వాటు అయ్యే ముందు ఇలాంటి విష‌యాల‌ను గ‌మనంలో పెట్టుకుంటే జూద క్రీడ‌ల జోలికి పోకుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

ఇవి కూడా చదవండి

జూదానికి అల‌వాటుప‌డ‌టానికి బ‌దులు, మ‌న తెలివితేట‌ల‌ను ఉప‌యోగించి వ్యాపారం చేయ‌డం ద్వారా లేదా, స‌క్ర‌మ‌మైన మార్గంలో ఆ తెలివితేట‌ల‌ను వినియోగించ‌డం ద్వారా మ‌నం స‌రైన మార్గంలో మ‌న జీవితానికి అవ‌స‌ర‌మైన డ‌బ్బును సంపాదించుకోవ‌చ్చు. జూద క్రీడ‌లు అల‌వాటు లేకుండా త‌మ‌కు వ‌చ్చే సంపాద‌న‌తో ఆనందంగా ఉంటున్న కుటుంబాల‌ను ఒక‌సారి చూసి, వారిలా మ‌న జీవితం ఎందుకు ఉండ‌కూడ‌ద‌ని అనుకుంటే మ‌నం జూద క్రీడ‌ల‌కు దూరంగా ఉండొచ్చు.  ఎవ‌రైనా వ్య‌క్తి జూదానికి అల‌వాటు ప‌డితే ఆ వ్య‌క్తి కుటుంబం ఎంత బాధ‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుంటే త‌ప్ప‌కుండా మ‌నం జూదానికి దూరంగా ఉండి జీవితాన్ని హ్యాపీగా గ‌డ‌ప‌వ‌చ్చు. లేదంటే మ‌న జీవితాన్ని మ‌న చేతులారా మ‌న‌మే నాశ‌నం చేసుకున్న వాళ్లం అవుతాం. అందుకే జూద క్రీడ‌ల‌కు దూరంగా ఉండి.. సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుదాం. ఇటీవల జూద క్రీడలకు అలవాటు పడి ఎంతో మంది అప్పులపాలై చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అందుకే జూద క్రీడలకు దూరంగా ఉండి ఆనందమయమైన జీవితాన్ని గడుపుదాం.