LIC Benefits: ఎల్ఐసీలో ఈ స్కీమ్ గురించి తెలుసా?.. ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ.14 వేలు పెన్షన్ పొందండి..

LIC Benefits: మీరు సేవింగ్స్‌పై దృష్టి పెట్టారా? భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులకు ప్లాన్స్ వేస్తున్నారా? ఏదేనీ పాలసీ..

LIC Benefits: ఎల్ఐసీలో ఈ స్కీమ్ గురించి తెలుసా?.. ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ.14 వేలు పెన్షన్ పొందండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2021 | 4:37 AM

LIC Benefits: మీరు సేవింగ్స్‌పై దృష్టి పెట్టారా? భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులకు ప్లాన్స్ వేస్తున్నారా? ఏదేనీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీలో ఎన్నో స్కీమ్‌లు ఉన్నాయి. అయితే ఇటీవల తీసుకువచ్చిన ఓ స్కీమ్‌ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్‌ను పొందే అవకాశం ఉండటమే అందుకు కారణం. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా బ్యాంక్ ద్వారా పొందే లబ్ధి కంటే అధిక లబ్ధి పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి..? ఆ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎంత పెట్టుబడి పెడితే ఎంత పెన్షన్ వస్తుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ ‘జీవన్ అక్షయ్’ పేరుతో యాన్యుటీ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీలో ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందే అవకాశ ఉంటుంది. ఈ స్కీమ్‌కు 30 నుంచి 85 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. పాలసీలో కనిష్టంగా రూ. లక్ష పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే, కనిష్ఠంగా రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్షన్ పొందవచ్చు. నెలకు వద్దనుకుంటే.. మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ప్రాతిపదికన కూడా పెన్షన్ పొందవచ్చు. ఇక లక్ష రూపాయల ప్లాన్‌లో ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకున్నట్లయితే రూ. 12,000 డబ్బు చేతికందుతుంది. అదే ఆరు మాసాలకు ఒకసారి తీసుకున్నట్లయితే రూ. 6,000 వస్తుంది.

ఇక మీరు ప్రతి నెలా రూ. 6వేలు పెన్షన్ పొందాలనుకుంటే రూ. 6,10,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇదే స్కీమ్‌లో త్రైమాసికంగా పెన్షన్ పొందితే రూ.18,225 వస్తాయి, అర్ధ సంవత్సరానికి రూ. 37,035, ఏడాదికి అయితే రూ.76,650 సొమ్ము పొందవచ్చు. అదే రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టారనుకోండి.. ప్రతి నెలా రూ. 14,000 పెన్షన్ పొందవచ్చు. అలాకాకుండా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే.. రూ. 1,68,000 డబ్బు అందుకోవచ్చు.

ఇదిలాఉంటే.. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ స్కీమ్‌లో పాలసీదారుడు బ్రతికున్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే పెన్షన్ ఆగిపోతుడి. పెట్టుబడి తిరిగి వస్తుంది.

Also read:

కడలిలో కళ్యాణం, స్కూబా డైవింగ్‌ సెషన్స్‌కి హాజరై మరీ తాళి కట్టించుకున్న వధువు శ్వేత. తీరం నుంచి 4.5 కిలోమీటర్లలోపల పెళ్లి తంతు

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో హైటెన్షన్, వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు