AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫొటోలు పెడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి

ఇంట్లో చనిపోయిన పెద్దల ఫొటోలను పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫొటోలో విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. పూర్వీకుల ఫొటోలోను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని అంటున్నారు. ఇంతకీ ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫొటోలు పెడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించండి
Representative Image
Narender Vaitla
|

Updated on: Sep 19, 2024 | 1:14 PM

Share

వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాస్తు అనేది కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. గదుల నిర్మాణంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలని చెబుతున్నారు.

ఇంట్లో చనిపోయిన పెద్దల ఫొటోలను పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫొటోలో విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. పూర్వీకుల ఫొటోలోను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని అంటున్నారు. ఇంతకీ ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూర్వీకుల ఫొటోలను పెట్టడానికి దక్షిణ దిశ మంచిదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. అందుకే చనిపోయిన వారి ఫొటోలను ఈ దిశలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు పూజ గదిలో కూడా పూర్వీకుల ఫొటోలను పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కాబట్టి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి ఫొటోలను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇక చనిపోయిన వారి ఫొటో విరిగిపోకుండా చూసుకోవాలి. అద్దం పగిలిన ఫొటోలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఫొటో ఫ్రేమ్‌ విరిగినా, పాడైపోయినా వెంటనే వెంటనే తొలగించి కొత్త ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చనిపోయిన ఒకే వ్యక్తికి సంబంధించిన ఎక్కువ ఫొటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఫొటోలను తూర్పుకు అభిముఖంగా పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ గోడకు ఏర్పాటు చేసి ఫొటో ఉత్తరం అభిముఖంగా ఉండడం బెస్ట్‌ అని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించండి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?