
మన దైనందిక జీవితంలో వాస్తు ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితమనే భావనలో ఉంటారు. అయితే ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లో మన దైనందిక జీవితంలో చేసే పనులు కూడా వాస్తుతో ముడిపడి ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఉదయం నిద్రలేవగానే చూయకూడని పనులు కూడా ఒకటి.
ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను చూడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే కొన్ని రకాల పనులు చేస్తే ఇంట్లో దరిద్రం పెరుగుతుందని, డబ్బు నిలవదని, దురదృష్టం వెంటాడుతుందని వాస్తు పండితులు చెబుతున్నార. ఇంతకీ ఉదయం లేవగానే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు.? ఏ పనులు చేస్తే, ఎలాంటి ఫలితాలు వస్తాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్లతో వాగ్వాదానికి దిగకూడదని చెబుతున్నారు. దీనివల్ల అది రోజంతా మీపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వీలైనంత వరకు ఉదయం నిద్రలేవగానే వెంటనే బెడ్ పై నుంచి లేవకుండా కాసేపు అలాగే కూర్చోవాలని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే రోజంతా అంత ప్రశాంతంగా ఉంటారని మానసిక వైద్య నిపుణులు కూడా చెబుతంటారు.
ఇక ఉదయం లేవగానే చాలా మంది గృహిణులు చేసే మొదటి పని ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడం. అయితే ఉదయం లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఎంగిలి గిన్నెలు చూడకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఎంగిలి గిన్నెలు చూడటం వల్ల దౌర్భాగ్యం ఎదురౌతుందంటారు. ఆర్ధిక ఇబ్బందులు కూడా వెంటాడవచ్చు. అందుకే నిద్రపోయే ముందు ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసుకుని ఉండాలి. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇక మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే చేసే పనిలో మరొకటి అద్దంలో ముహం చూసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో అద్దంలో చూసుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇది మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోజులో చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..