పోస్టాఫీస్‏లో సేవింగ్స్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? ఈ స్టెప్స్ ఫాలో అయితే సులభంగా చేసుకోవచ్చు..

ఆధార్ కార్డు మన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పథకాలను పొందడానికి వీలులేకుండా పోయింది.

పోస్టాఫీస్‏లో సేవింగ్స్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? ఈ స్టెప్స్ ఫాలో అయితే సులభంగా చేసుకోవచ్చు..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 7:47 AM

Aadhar Link With Post Office Savings Account: ఆధార్ కార్డు మన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పథకాలను పొందడానికి వీలులేకుండా పోయింది. ఇటీవలే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆధార్ లింక్ తప్పనిసరి చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి పోస్టాఫీస్ కూడా వచ్చి చేరింది. పోస్టల్ శాఖ అందిస్తున్న సేవింగ్స్ స్కీంలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమ ఆధార్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని ఆన్ లైన్, ఆఫ్ లైన్లో చేసే డిపాజిట్లు, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ) వంటి పలు రకాల సేవింగ్స్ స్కీంలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే అందుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేని వ్యక్తులు తమ ఆధార్ ఎన్ రోల్ మెంట్ నంబరుతో కూడా అకౌంట్ తెరవచ్చని పోస్టాఫీసు తెలిపింది. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలకు ఆధార్ లింక్ చేయాడానికి ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాలలో చేయవచ్చు. అదేలానో తెలుసుకుందాం.

ఆన్‏లైన్ లింక్..

➦ ముందుగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్‏కు సంబంధించి నెట్ బ్యాంకింగ్ వెబ్‏సైట్ సందర్శించాలి. ➦ అనంతరం మీ యూజర్ ఐడీ, పాస్‏వర్డ్‏లను ఎంటర్ చేసి మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‏కు లాగిన్ కావాలి. ➦ ఆ తర్వాత “ఇంటర్నెట్ బ్యాంకింగ్‏తో ఆధార్ రిజిస్ట్రేషన్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. ➦ అనంతరం మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కన్ఫార్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ➦ ఆ తర్వాత మీరు ఆధార్ లింక్ చేయాల్సిన ఇండియన్ పోస్ట్ బ్యాంక్ అకౌంటును సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ➦ ఈ ప్రాసెస్ పూర్తికాగానే.. తిరిగి హోంపేజీలోని ఎంక్వైరీ ఆప్షన్ పై క్లిక్ చేసి.. ఆధార్ లింక్ పూర్తయిందో లేదో తెలుసుకోవచ్చు.

ఆఫ్‏లైన్ లింక్..

➦ ముందుగా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ పాస్ బుక్, ఆధార్ లింక్ చేయాడానికి సమీపంలోని పోస్టాఫీస్‏కు వెళ్లాలి. ➦ అక్కడ ఆధార్ లింకింగ్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకోని ఫిల్ చేయాలి. ➦ ఆనంతరం మీ ఆధార్ జీరాక్స్ కాపీని అప్లికేషన్ పారంతో జతచేసి ఇవ్వాలి. ➦ ఆ తర్వాతా మీ అప్లికేషన్ దృవీకరించి, మీకు రశీదును అందజేస్తారు. ➦ మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటుకు రిజిస్టర్డ్ అయి ఉన్న మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ వస్తుంది.

Also Read: ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి.? 2 నిమిషాల్లో లింక్ చేసుకొండి ఇలా..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!