Voter Id: గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం.. త్వరలో ఓటర్ ఐడిలో కొత్త నిబంధనలు.!
Voter Id: ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలు మారిపోతున్నాయి. కొత్త కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆధార్ విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి..
Voter Id: ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలు మారిపోతున్నాయి. కొత్త కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆధార్ విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి. ప్రతిదానికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. గతంలో పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్లు, ఇతర వాటికి అనుసంధానించాల్సి ఉండగా, ఇప్పుడు ఓటర్ ఐడి (Voter Id) కార్డుకు కూడా ఆధార్ నంబర్ (Aadhaar Number)ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటర్ ఐడికార్డుకు ఆధార్ అనుసంధానం చేయడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేయనుంది. ఓటర్లు స్వచ్చందంగా ఆధార్ వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేయనివారు అందుకు కారణాలు చెప్పాల్సి ఉంటుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషర్ సుశీల్ చంద్ర తెలిపారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్ర మాట్లాడుతూ.. తాను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో రెండు ప్రధాన ఎన్నికల సంస్కరణలు జరిగాయన్నారు. ఇక నుంచి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, అయితే సంవత్సరంలో నాలుగు సార్లు ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఇది వరకు ప్రతి సంవత్సరం జనవరి1న మాత్రమే ప్రజల తమ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఏడాదిలో నాలుగు తేదీలను ప్రకటిస్తామని, ఆ తేదీల్లో 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను లింక్ చేయడానికి అనుమతించడానికి కొన్ని నెలల క్రితం పార్లమెంటు ఆమోదించిన బిల్లులో భాగంగా నమోదు కోసం నాలుగు ప్రకటిస్తామన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి