Breaking: ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా..? డీజీపీపై హైకోర్టు మండిపాటు..!

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబుకు సీర్పీసీ 151 నోటీసులు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Breaking: ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా..? డీజీపీపై హైకోర్టు మండిపాటు..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 4:49 PM

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబుకు సీపీఆర్సీ 151 నోటీసులు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా..? అంటూ సీజే మండిపడ్డారు. సీపీఆర్సీ 151 సెక్షన్ ఆర్డర్ చదవమన్న సీజే.. పోలీసులపై యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని అడిగారు. అసలు ఈ విషయంలో విశాఖ పోలీస్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని సీజే ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీజీపీ స్పందిస్తూ.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్లనే తీసుకోలేదని అన్నారు. కోర్టు ఆదేశిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. విశాఖలో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన అలాంటి చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీజే.. మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. మీ కింద అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే దాన్ని సమర్ధిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీజే.. విశాఖలో ఏ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సీజే వాయిదా వేశారు.

Read This Story Also: పున్నుకు ఏమైంది..! రాహుల్‌‌ దాడిపై మాట్లాడకపోవడానికి కారణమిదేనా..!