AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish in Winter: ముల్లంగి తింటే 100 రోగాలు మాయం.. యోగా గురు బాబా రాందేవ్‌ ఆరోగ్య సూత్రాలు విన్నారా?

శీతాకాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన చుట్టూ ఉన్న అనేక విషయాలు మారుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో మార్కెట్‌లో కొన్ని కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. వాటిల్లో ముల్లంగి ఒకటి. చాలా మంది ముల్లంగిని సలాడ్‌లుగా తినడానికి ఇష్టపడతారు. దీని ఆకులను కూరల తయారీకి ఉపయోగిస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది..

Radish in Winter: ముల్లంగి తింటే 100 రోగాలు మాయం.. యోగా గురు బాబా రాందేవ్‌ ఆరోగ్య సూత్రాలు విన్నారా?
Baba Ramdev Speech On Radish
Srilakshmi C
|

Updated on: Nov 10, 2025 | 7:03 PM

Share

శీతాకాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన చుట్టూ ఉన్న అనేక విషయాలు మారుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో మార్కెట్‌లో కొన్ని కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. వాటిల్లో ముల్లంగి ఒకటి. చాలా మంది ముల్లంగిని సలాడ్‌లుగా తినడానికి ఇష్టపడతారు. దీని ఆకులను కూరల తయారీకి ఉపయోగిస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ముల్లంగిని ఆరోగ్యానికి ఓ వరమని చెబుతున్నారు. ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి 100 వ్యాధులను నయం చేయగలవని ఆయన చెప్పారు.

బాబా రామ్‌దేవ్ తన సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లను షేర్ చేయడం ద్వారా ఆరోగ్య సంబంధిత సమస్యలకు పరిష్కారాలను అందిస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్‌దేవ్ ముల్లంగి ప్రయోజనాలను వివరించే వీడియోను పోస్ట్ చేశారు. ముల్లంగి 100 అనారోగ్యాలను ఎలా నయం చేస్తుందో కూడా ఆయన అందులో వివరించారు. కాబట్టి ముల్లంగితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాల ముల్లంగి

ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్‌లు కూడా ఉంటాయి. అయితే రాత్రిపూట ముల్లంగిని తినకూడదు. ఎందుకంటే ముల్లంగి వెచ్చదనం, చల్లదనం రెండింటినీ కలిగి ఉంటుంది. అందుకే జలుబు ఉన్నవారు రాత్రిపూట ముల్లంగిని తినకూడదు. బాబా రామ్‌దేవ్ ముల్లంగి ప్రయోజనాల గురించి చెబుతూ.. ఒక వ్యక్తి 2-3 నెలలు క్రమం తప్పకుండా ముల్లంగి తింటే వారు ఎప్పటికీ అనారోగ్యానికి గురికారని బాబా రామ్‌దేవ్ అంటున్నారు. ముల్లంగి తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు, గుండె, మొత్తం జీర్ణక్రియ మెరుగుపడుతుందని రామ్‌దేవ్ తెలిపారు. ముల్లంగి తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఇది వాత, పిత్త రుగ్మతలను సైతం నివారించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహంతో సహా వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ముల్లంగి ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో భలేగా పనిచేస్తుందని బాబారాందేవ్‌ చెప్పారు. ముల్లంగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి తినడం వల్ల జీర్ణవ్యవస్థ పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ముల్లంగి తినలేకపోతే దానిని రోజులో ఎప్పుడైనా ఉప్పుతో కలిపి మిల్లెట్ బ్రెడ్‌తో తినవచ్చు. ముల్లంగి తినండి, మూలం నుంచి వ్యాధులను నివారించండని రామ్‌దేవ్ పిలుపునిచ్చారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.