చలికాలంలో ఈ ఆహారాలను వేడి చేసి తింటే మీ బాడీ షెడ్డుకే.. లైట్ తీసుకుంటే..
ఆహారాన్ని వృథా చేయకూడదనో లేదా సమయం ఆదా చేయడానికో ఉదయం వండిన వాటిని మళ్లీ వేడి చేసి తింటే, దానిలోని పోషకాలు నాశనమవుతాయి. అంతేకా, అన్నం, గుడ్లు, చికెన్‌లో బాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. పదే పదే వేడి చేయడం వల్ల నూనెల్లోని కొవ్వులు విషపదార్థాలను విడుదల చేసి కాలేయం, శరీరంలో వాపుకు కారణమవుతాయి.

ప్రతి ఇంట్లో ఆహారం వండటం సాధారణ ప్రక్రియే. అయితే చాలా ఇళ్లలో ఉదయం మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి మధ్యాహ్నం లేదా రాత్రి తినడం జరుగుతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడానికో లేదా ఆహారాన్ని వృథా చేయకూడదనే మంచి ఉద్దేశంతోనో చేసినప్పటికీ, ఆరోగ్య నిపుణులు ఈ అలవాటుపై*తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మాత్రమే కాదు అందులోని పోషక విలువలు కూడా పూర్తిగా నాశనమవుతాయి. అంతేకాకుండా ఈ విధంగా కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
ఆరోగ్యంపై పదే పదే వేడి చేసే ప్రభావం
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రోహిత్ శర్మ ప్రకారం.. ముఖ్యంగా శీతాకాలంలో ప్రజలు వండిన సాంబార్, సూప్, అన్నం వంటి వాటిని తరచుగా వేడి చేస్తారు. కానీ ఈ పద్ధతి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది:
బ్యాక్టీరియా వృద్ధి: శీతాకాలంలో ఆహారం త్వరగా చల్లబడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచితే.. బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదల ప్రమాదం పెరుగుతుంది.
పోషకాలు నష్టం: ఆహారాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు.. దానిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల సహజ సమతుల్యత దెబ్బతింటుంది.
ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం: అన్నం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లు వంటి ఆహారాలలో బాసిల్లస్ సెరియస్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలకు కారణమవుతుంది.
విషపూరిత కొవ్వులు విడుదల
ఆహారాన్ని తరచుగా వేడి చేయడం వల్ల నూనె, సుగంధ ద్రవ్యాలలో ఉండే కొవ్వులు ఆక్సీకరణం చెందుతాయి.
ఈ ప్రక్రియ శరీరంలోకి విషపూరిత మూలకాలను విడుదల చేస్తుంది. ఇవి కాలేయాన్ని ప్రభావితం చేయడంతో పాటు శరీరంలో వాపుకు కూడా కారణమవుతాయి.
ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటంటే?
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి:
తక్కువగా వండండి: ఒకేసారి ఎక్కువగా కాకుండా, మీరు ఒక పూట తినగలిగినంత ఆహారాన్ని మాత్రమే వండడానికి ప్రయత్నించండి.
నిల్వలో జాగ్రత్త: మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచడం పూర్తిగా మానుకోండి.
వీరికి వద్దు: ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులకు ఇచ్చే ఆహారాన్ని మళ్లీ వేడి చేయకుండా ఉండాలి. ఇది వారి రోగనిరోధక శక్తిని మరింత బలహీనపరుస్తుంది.
శీతాకాలంలోనే కాకుండా, అన్ని సీజన్లలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ మొత్తం కుటుంబాన్ని అనారోగ్యాల నుండి కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




