AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. వామ్మో.. ఈ పండ్లు అస్సలు తినొద్దు..

వాస్తవానికి చిన్నప్పటి నుంచి మనకు పండ్లు మంచి ఆరోగ్య రహస్యం అని పెద్దలు చెబుతుంటారు.. అయితే.. కొన్ని పండ్లు.. కొందరికి మంచివి కావని పేర్కొంటున్నారు. కొన్ని పండ్లలో చక్కెర, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి.. ఇవి ఇన్సులిన్ స్థాయికి ఆటంకం కలిగిస్తాయి. ఈ పండ్లను సమతుల్యత లేకుండా తీసుకుంటే, అది శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. వామ్మో.. ఈ పండ్లు అస్సలు తినొద్దు..
Diabetes Fruits
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2025 | 1:05 PM

Share

పండ్లు తినడం శరీరానికి మంచిదని అందరికీ తెలుసు.. రోజూ ఆపిల్ లాంటి పండు తింటే డాక్డర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదంటుంటారు.. కానీ కొన్ని పండ్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి చిన్నప్పటి నుంచి మనకు పండ్లు మంచి ఆరోగ్య రహస్యం అని పెద్దలు చెబుతుంటారు.. అయితే.. కొన్ని పండ్లు.. కొందరికి మంచివి కావని పేర్కొంటున్నారు. కొన్ని పండ్లలో చక్కెర, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి.. ఇవి ఇన్సులిన్ స్థాయికి ఆటంకం కలిగిస్తాయి. ఈ పండ్లను సమతుల్యత లేకుండా తీసుకుంటే, అది శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.

ముఖ్యంగా మధుమేహ రోగులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మామిడి, ద్రాక్ష, అరటి, దానిమ్మ, సపోటా వంటి అధిక తీపి పండ్లు వారి గ్లూకోజ్ స్థాయిని దెబ్బతీస్తాయి. వీటిలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, ఫ్రక్టోజ్ కంటెంట్ ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా, ప్రతిరోజూ అధిక తీపి పండ్లు తింటే.. ఎటువంటి శారీరక వ్యాయామం చేయకపోతే, క్రమంగా బరువు పెరుగుతాడు.. వాస్తవానికి చక్కెరతో జీవక్రియ ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఎక్కువ కాలం ఇలా చేయడం వల్ల మందుల మోతాదును పెంచడం కూడా అవసరం కావచ్చు.

అత్యధిక చక్కెర స్థాయిలు కలిగిన పండ్లు ఇవే..

నోయిడా డైటీషియన్ డాక్టర్ రక్షిత మెహ్రా చక్కెర స్థాయిని పెంచే పండ్ల గురించి చెప్పారు. అయితే, ఈ పండ్లు ప్రతి వ్యక్తిలో చక్కెర స్థాయిని పెంచవని.. డాక్టర్ మెహ్రా అంటున్నారు. కానీ వాటిని పరిమిత పరిమాణంలో తినడం మంచిదన్నారు. అలాగే.. పండ్లను ఎక్కువగా తీసుకోకూడదని పేర్కొన్నారు. అయితే.. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ పండ్లకు దూరంగా ఉండాలన్నారు.

మామిడి: మామిడి రుచిలో తియ్యగా.. జ్యుసిగా ఉంటుంది. కానీ ఇందులో ఫ్రక్టోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మధ్య తరహా మామిడిలో దాదాపు 30 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.

అరటిపండు: అరటిపండులో ఫైబర్ – పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కానీ అది పండినప్పుడు, దాని చక్కెర శాతం మరింత పెరుగుతుంది. ఒక మధ్యస్థ అరటిపండులో దాదాపు 14 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది..

లిచీ: లిచీ వేసవిలో దొరికే ఒక ప్రత్యేక పండు.. దీనిని ఎక్కువగా తింటారు. కానీ లిచీలో చక్కెర కూడా పుష్కలంగా ఉంటుందని గుర్తుంచుకోండి. 10-12 లిచీలలో దాదాపు 29-30 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.

దానిమ్మ: దానిమ్మను ఆరోగ్యకరమైన పండుగా పరిగణిస్తారు.. కానీ దానిలోని చక్కెర గురించి మాట్లాడుకుంటే, 1 కప్పు దానిమ్మ గింజలలో దాదాపు 24 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.

డయాబెటిస్ ఉన్న వారు ఏ పండ్లు తినవచ్చు?

ఆపిల్, బొప్పాయి, జామున్, జామకాయ, నారింజ లాంటి షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న పండ్లు తినవచ్చు..