World Asthma Day: భారతదేశంలో(India) దాదాపు ఆరు శాతం మంది పిల్లలు, రెండు శాతం పెద్దలు ఆస్తమాతో బాధపడుతున్నారని 2018 గ్లోబల్ ఆస్తమా నివేదిక వెల్లడించింది. దేశంలో దాదాపు 93 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 37 మిలియన్లు ఆస్తమా రోగులు. అంటే ప్రపంచంలోని మొత్తం ఆస్తమా రోగులలో 11.1 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 80 శాతం కంటే ఎక్కువ ఆస్తమా మరణాలు తక్కువ మధ్య ఆదాయ దేశాలలో సంభవించాయని తెలుస్తోంది.
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2022: ఆస్తమా కేర్‌లో క్లోజింగ్ గ్యాప్ అనేది థీమ్. ఈ సందర్భంగా ఘజియాబాద్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లోని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సుమిత్ కుమార్ గుప్తా ఈ వ్యాధికి సంబంధించిన అపోహలు ఈ వ్యాధికి కారణాల గురించి TV9 తో తెలిపారు.
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, “ఆస్తమా పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ దుమ్ము, కాలుష్యం ఉన్న ప్రదేశాలలో.. దీనికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. కానీ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో దుమ్ము, ధూళి, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇక్కడ పిల్లలలో ఆస్తమా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాదు వేసవిలో ఆస్తమా కేసులు అధికంగా నమోదవుతాయి. కోవిడ్‌కి ముందు గత మూడు-నాలుగేళ్లలో ఆస్తమా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మహమ్మారి సమయంలో తక్కువ కేసులు కనిపించాయి. అయితే మళ్ళీ గత మూడు-నాలుగు నెలల్లో ఆస్తమా కేసులు పెరిగి చిన్నారులను ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం భారతదేశంలో ప్రతి వెయ్యి మంది పిల్లలలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఆస్తమాతో బాధపడుతున్నారు.
ఆస్తమా గురించి అపోహలు:
ఉబ్బసం, కోవిడ్ ల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని డాక్టర్ చెప్పారు. “జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రావచ్చు. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్య లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం వస్తుంది. ఒక వ్యక్తి దుమ్ము, కాలుష్యం, విపరీతమైన చలి, వాతావరణంలో విపరీతమైన మార్పులకు గురైనప్పుడు లేదా శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు ఏర్పడినప్పుడు ఆస్తమా కలుగుతుంది.
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ.. “ఆస్తమా ఉన్న పిల్లలు శారీరక శ్రమ చేయలేరనేది నిజం కాదు. వారు ఏరోబిక్స్ చేయగలరు. అయితే ఊపిరి అధికంగా తీసుకునే విధంగా ఎక్కువ శారీరక శ్రమ చేయకూడని చెప్పారు.
2,3 సంవత్సరాల వయస్సులో లక్షణాలు:
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఒత్తిడి ఉండదని, అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బందిని ఉండదని, అయితే పిల్లలకు 8-10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒత్తిడి ఏర్పడుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, “రెండు-మూడేళ్ల వయస్సు నుండి పిల్లలలో ఆస్తమా లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. అయితే ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సులో ఈ వ్యాధి తెరపైకి వస్తుంది.
కుటుంబ చరిత్రలో వ్యాధి ఉన్న పిల్లల్లో లేదా తల్లిదండ్రులకు ఏదో ఒక రకమైన అలెర్జీ ఉన్న పిల్లలలో ఆస్తమా సాధారణమని ఆయన అన్నారు. “ఆస్తమా అకస్మాత్తుగా వచ్చే వ్యాధి కాదు. ఇది క్రమంగా జరిగే ప్రక్రియ, ఇది పునరావృతమయ్యే శ్వాసకోశ సమస్యతో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనా ఆరు నెలలు గడిచే వరకు అతనికి ఆస్తమా ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.
నెబ్యులైజర్ ద్వారా పిల్లలకి ఔషధం:
చిన్న పిల్లలకు నెబ్యులైజర్ ద్వారా మందు ఇస్తున్నామని డాక్టర్ గుప్తా చివరకు చెప్పారు. ఇది శ్వాసకోశ వ్యాధుల్ని నివారించడంలో చాలా మెరుగైనది. పెద్దవారు నెబ్యులైజర్‌ను తమతో తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. అప్పుడు పఫ్ నిర్వహించడం సులభమని తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు