తరచుగా తుమ్ములు వస్తున్నాయా..? మీ ఇంట్లో దాగి ఉన్న ఈ కారణాలే కావొచ్చు.. జాగ్రత్త..!
తరచుగా తుమ్ములు, జలుబు, అలెర్జీలతో ఇబ్బంది పడుతున్నారా..? కారణం బయట గాలి కాదు.. మీ ఇంట్లోనే దాగి ఉన్న డస్ట్ మైట్స్ కావచ్చు. మంచం, దిండ్లు, కర్టెన్లు, తివాచీలు, ఏసీ వంటి వస్తువులలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సరైన శుభ్రత పాటిస్తే డస్ట్ అలెర్జీ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

Weak Immunity System
తరచుగా తుమ్ములు, చిన్న చిన్న అలెర్జీలతో ఇబ్బంది పడుతున్నారా..? దీనికి కారణం బయట ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. ముఖ్యంగా మంచం, దిండ్లు, కర్టెన్లు, తివాచీలు.. ఇవన్నీ డస్ట్ మైట్స్ (dust mites)కి ఫేవరెట్ ప్లేస్ అవుతాయి. బయట నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇల్లు సరిగ్గా లేకపోతే ఈ సమస్యలు ఇంకా పెరుగుతాయి. తెలియకుండానే ఇవి మీ హెల్త్‌ని దెబ్బతీస్తాయి.
తుమ్ములు, అలెర్జీలకు అసలు కారణాలు
- తివాచీలు, రగ్గులు.. ఇంట్లో వేసే తివాచీలు, రగ్గుల్లో డస్ట్ మైట్స్ ఎక్కువగా పేరుకుపోతాయి. అవి గాలిలోకి వెళ్ళినప్పుడు అలెర్జీలు, తుమ్ములకు కారణమవుతాయి. అందుకే వాటిని తరచుగా క్లీన్ చేయడం ముఖ్యం.
- మంచం, దిండు.. మనకు కనిపించకపోయినా మంచం క్లాత్స్, దిండ్లలో చాలా సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఇవి దురద, తుమ్ములు, ముక్కు కారడం లాంటి ప్రాబ్లమ్స్‌కి కారణమవుతాయి.
- కర్టెన్లు.. కిటికీలకు వేసే కర్టెన్లలోనూ డస్ట్ మైట్స్ పేరుకుపోతాయి. బయట గాలిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ను ఇవి అడ్డుకుని లోపలే ఉంచుతాయి. దీని వల్ల జలుబు, తుమ్ములు ఎక్కువవుతాయి.
- మొక్కలు.. ఇంట్లో పెంచే కొన్ని మొక్కలు పుప్పొడి లేదా ఫంగస్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటి కారణంగా శ్వాస ఇబ్బందులు, కళ్ళు కారడం, తుమ్ములు రావచ్చు.
- క్లీనింగ్ ప్రొడక్ట్స్.. ఇంటిని క్లీన్ చేయడానికి వాడే కొన్ని కెమికల్ క్లీనర్లు స్ట్రాంగ్ స్మెల్, కెమికల్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి కొంతమందిలో స్కిన్ అలెర్జీలు, శ్వాస సమస్యలకు దారితీస్తాయి.
- ఎయిర్ కండిషనర్ (AC).. ఏసీ కూలింగ్ ఇస్తుంది కానీ దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోతే డస్ట్ పార్టికల్స్ అందులో పేరుకుపోతాయి. అవి గాలి లోకి వచ్చి అలెర్జీలను పెంచుతాయి. అందుకే ఏసీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం.




