Cancer: 50 యేళ్లలోపు యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. కారణం అదే అంటోన్న నిపుణులు

|

Apr 01, 2024 | 8:27 PM

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి యేట పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషులలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తుంటే.. మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారి తీస్తున్న కారణాలలో క్యాన్సర్ ముఖ్యమైనది. ఇప్పుడు యువతలో కూడా పెద్ద సంఖ్యలో క్యాన్సర్‌ కేసులు కనిపిస్తున్నాయి..

Cancer: 50 యేళ్లలోపు యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. కారణం అదే అంటోన్న నిపుణులు
Cancer Causes
Follow us on

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి యేట పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషులలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తుంటే.. మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారి తీస్తున్న కారణాలలో క్యాన్సర్ ముఖ్యమైనది. ఇప్పుడు యువతలో కూడా పెద్ద సంఖ్యలో క్యాన్సర్‌ కేసులు కనిపిస్తున్నాయి. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కొన్ని కేసులు కనిపిస్తున్నాయి. సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఎందుకు యువత బాధితులుగా మారుతున్నారో, ఆ వివరాలు ఏమిటో నిపుణుల మాటల్లో మీకోసం..

యువతలో క్యాన్సర్ వ్యాపించడానికి ప్రధాన కారణం గతితప్పిన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, అతిగా మద్యం సేవించడం, ధూమపానం వంటివి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా ఊబకాయం పెద్ద సమస్య. అధిక బరువు ఉండటం వల్ల క్యాన్సర్ మానిఫోల్డ్ అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఎండలో ఎక్కువ సమయం ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ.

నిపుణులు ఏమంటున్నారంటే?

క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యంత సాధారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్.. పురుషులలో కొలొరెక్టల్ క్యాన్సర్ కనిపిస్తున్నాయి. చిన్న వయసులో క్యాన్సర్ రావడానికి అతి పెద్ద కారణం చెడు జీవనశైలి, వివిధ రకాల డ్రగ్స్‌కు అలవాటు పడటం. గత కొన్నేళ్లుగా ఊబకాయం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం కూడా క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకం.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ప్రజలు తమ ఆహార అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి జీవనశైలిని కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఆకుపచ్చని పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. పొగాకు వినియోగం, అధికంగా మద్యం సేవించడం మానుకోవాలి. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. శరీరంలో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా భాగంలో గడ్డ ఏర్పడినా తేలిగ్గా తీసుకోకూడదు.

క్యాన్సర్‌కు మందు ఉందా?

ఆధునిక ఔషధాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నయం చేయవచ్చని డాక్టర్ ఆశిష్ గుప్తా చెబుతున్నారు. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్ నివారణ రేటు గణనీయంగా పెరిగిందని అన్నారు. CAR-T థెరపీ, రోబోటిక్ సర్జరీ కూడా క్యాన్సర్ చికిత్సను సులభతరం చేశాయి. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ఈ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.