AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఇలా చేస్తే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?

ఆపిల్ ఆరోగ్యానికి మంచిదన్నది అందరికీ తెలిసిన సంగతే. అయితే ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. ఆపిల్ తినే సరైన సమయం, తిన్న తర్వాత జాగ్రత్తలు తెలుసుకోవడం ముఖ్యం.

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఇలా చేస్తే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..?
గతంలో నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది వాడుతున్నప్పటికీ అధిక మంది మాత్రం ఫ్రిజ్ నుంచి నీళ్లు తాగుతున్నారు. సులభంగా చల్లగా మారుతాయని వారాల తరబడి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా? తాగే నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు నిల్వ చేస్తే ఏమవుతుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..
Prashanthi V
|

Updated on: Apr 23, 2025 | 10:00 AM

Share

ఆపిల్ తినడం అనేది చాలా మందికి ఆరోగ్యానికి మంచిది అని తెలిసిన విషయం. ఆపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పండ్లను తినేటప్పుడు వాటితో పాటు నీళ్లు తాగడం గురించి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.

ఈ విషయంపై కొంతమంది మనసులో సందేహాలు ఉంటే మరి కొంతమంది కొద్ది గంటల తర్వాత నీళ్లు తాగడం మంచిది అని అనుకుంటారు. అయితే ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకోవడం అవసరం.

ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగడం శరీరానికి మేలేమో.. కానీ ఇది జీర్ణక్రియను నెమ్మదిగా చేసే ప్రభావం చూపిస్తుంది. ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్ల ప్రభావం తగ్గిపోతుంది. ఈ కారణంగా జీర్ణక్రియ స్లోగా అవుతుంది కాబట్టి ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంతమందికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఆపిల్ తినాలనుకుంటే కొన్ని సమయాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆపిల్ తినే ముందు నీళ్లు తాగడం కూడా శరీరానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే అల్పాహారం తర్వాత ఆపిల్ తినడం మంచిది. ఆపిల్ తిన్న తర్వాత కనీసం అరగంట నుండి ఒక గంట వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం. దీని వల్ల ఆపిల్‌లోని పోషకాలు శరీరానికి బాగా గ్రహించబడతాయి.

ఆపిల్ తినడానికి ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరగదు. ఆపిల్ తిన్న తర్వాత శరీరంలో ఉండే ప్రాసెస్‌లు ఆలస్యం కావచ్చు. దీంతో ఆపిల్ లోని పోషకాలు నెమ్మదిగా శరీరంలో గ్రహించబడతాయి. దాంతో మీరు ఆపిల్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగినా లేదా వాటిని తినడానికి ముందు నీళ్లు తాగినా.. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.

ఆపిల్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా ఉపయోగపడకుండా పోయే అవకాశం ఉంటుంది. ఆపిల్ తినేటప్పుడు మన శరీరంలో జీర్ణక్రియ సహాయకమైన ఎంజైములు విడుదల అవుతాయి. ఈ ఎంజైమ్లు మంచి జీర్ణక్రియను ప్రోత్సహించడానికి.. శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. అలాగే ఆపిల్ తినడం వలన శరీరానికి అవసరమైన శక్తి లభించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

ఫైనల్ గా చెబుతుంది ఏమిటంటే మీరు బ్రేక్‌ఫాస్ట్ అయినా లేదా లంచ్ అయినా తర్వాత ఆపిల్ తినొచ్చు. అయితే ఆపిల్ తిన్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుంచి గంట వరకూ నీళ్లు తాగకుండా ఉండటం మంచిది. ఇలా చేస్తే ఆపిల్‌లోని అన్ని పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
బిర్యానీ, బగారా రైస్, చపాతీల్లోకి లొట్టలేసే రుచితో ఎగ్ షేర్వా
బిర్యానీ, బగారా రైస్, చపాతీల్లోకి లొట్టలేసే రుచితో ఎగ్ షేర్వా
ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి మహిళపై అఘాయిత్యం..!
ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి మహిళపై అఘాయిత్యం..!
భాగస్వామిని ప్రేమిస్తున్నారా? అయితే ఈ విషయాల్లో మాట జారకండి
భాగస్వామిని ప్రేమిస్తున్నారా? అయితే ఈ విషయాల్లో మాట జారకండి
మసాలాలు లేకుండా హై-ప్రోటీన్ మొలకల కుర్మా..
మసాలాలు లేకుండా హై-ప్రోటీన్ మొలకల కుర్మా..
అమ్మో బుధవారం..! ఈ పేరు వింటేనే వణుకుతున్న కోనసీమ..!
అమ్మో బుధవారం..! ఈ పేరు వింటేనే వణుకుతున్న కోనసీమ..!
పురుషులకూ గర్భనిరోధక మాత్రలు? ఎలా పనిచేస్తుందో తెలుసా?
పురుషులకూ గర్భనిరోధక మాత్రలు? ఎలా పనిచేస్తుందో తెలుసా?
OTTని ఊపేస్తోన్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ.
OTTని ఊపేస్తోన్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ.
ఇంట్లో కూరగాయలు లేవా? పచ్చిమిర్చితో 5 నిమిషాల్లో కారం పచ్చడి..
ఇంట్లో కూరగాయలు లేవా? పచ్చిమిర్చితో 5 నిమిషాల్లో కారం పచ్చడి..
మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి మేడ్చల్ కోర్టు జైలు శిక్ష
మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి మేడ్చల్ కోర్టు జైలు శిక్ష
స్వీట్ షాప్ కంటే రుచిగా.. ఇంట్లోనే చేసే పప్పు చేగోడీలు
స్వీట్ షాప్ కంటే రుచిగా.. ఇంట్లోనే చేసే పప్పు చేగోడీలు