మూత్ర విసర్జన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు.. బీకేర్‌ఫుల్

మూత్ర విసర్జన సమయంలో లేదా తర్వాత మంటగా అనిపించడం ఒక సాధారణ సమస్య కావచ్చు.. కానీ దానిని విస్మరించడం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది.. మూత్ర విసర్జన సమయంలో లేదా తర్వాత మంటగా అనిపించడం కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.

మూత్ర విసర్జన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు.. బీకేర్‌ఫుల్
Pain or Burning With Urination
Follow us

|

Updated on: Sep 14, 2024 | 6:09 PM

మూత్ర విసర్జన సమయంలో లేదా తర్వాత మంటగా అనిపించడం ఒక సాధారణ సమస్య కావచ్చు.. కానీ దానిని విస్మరించడం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది.. మూత్ర విసర్జన సమయంలో లేదా తర్వాత మంటగా అనిపించడం కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఈ సమస్య పదే పదే ఎదురవుతూ, ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రం పోసే సమయంలో మంట లేదా యూరినేషన్ తర్వాత మంట అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వీటిలో మూడు తీవ్రమైన వ్యాధులు ప్రధానంగా బాధ్యత వహిస్తాయి. వాటిపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.. లేకపోతే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది.. ఈ వ్యాధులు ఏమిటి..? వాటి లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI). ఈ ఇన్ఫెక్షన్ మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో (మూత్రపిండాలు, మూత్రాశయం లేదా మూత్ర నాళం వంటివి) సంభవించవచ్చు. యుటిఐ ఇన్ఫెక్షన్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర లక్షణాలలో తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో దుర్వాసన, పొత్తి కడుపులో నొప్పి లాంటి సమస్య ఉండవచ్చు.

కిడ్నీ స్టోన్స్: మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే.. అది కూడా కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు. కిడ్నీ స్టోన్స్.. వ్యర్థ ఖనిజాలు, ఉప్పు లాంటి చిన్న కణాలు.. ఇవి మూత్రపిండాలలో పేరుకుపోవడం ప్రారంభమైతే చాలా ఇబ్బందికర పరిర్థితులు ఎదుర్కొవలసి ఉంటుంది.. కిడ్నీలో రాళ్ల కారణంగా, మూత్ర నాళంలో ఒక బ్లాక్ ఏర్పడుతుంది.. ఇది మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పిని కలిగిస్తుంది. ఇది కాకుండా, వీపు దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తస్రావం కూడా రాళ్ల లక్షణాలు కావచ్చు.

లైంగికంగా సంక్రమించే వ్యాధులు: మూత్ర విసర్జన సమయంలో మండే అనుభూతికి మరొక తీవ్రమైన కారణం లైంగికంగా సంక్రమించే వ్యాధులు. ప్రత్యేకించి మీరు లైంగికంగా సంక్రమించే వ్యాధి (STI) ద్వారా ప్రభావితమైతే, ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. గోనేరియా, క్లామిడియా వంటి వ్యాధులు మూత్ర విసర్జన సమయంలో మంటను కలిగిస్తాయి. ఇది కాకుండా, ప్రైవేట్ పార్ట్స్ లో దురద, అసాధారణమైన ఉత్సర్గ, శారీరసంబంధం సమయంలో నొప్పి కూడా ఈ వ్యాధుల ఇతర లక్షణాలు కావచ్చు.

ఇతర కారణాలు:

నిర్జలీకరణం : శరీరంలో నీటి కొరత (డీ హైడ్రేషన్) కూడా మూత్రవిసర్జన సమయంలో మండే అనుభూతిని కలిగిస్తుంది.

మధుమేహం : డయాబెటిక్ పేషెంట్లలో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మూత్రాశయంలో వాపు: సిస్టిటిస్ అనే పరిస్థితిలో, మూత్రాశయం ఉబ్బిపోతుంది. దీని కారణంగా మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?..

బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు మీరు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే, మూత్రంలో రక్తం కనిపించడం, కడుపునొప్పి లేదా జ్వరం వంటివి కనిపిస్తే, ఈ సంకేతాలు తీవ్రంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.. అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..