Red Spinach: ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

Red Spinach: ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

Anil kumar poka

|

Updated on: Sep 14, 2024 | 4:48 PM

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఏదొక ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. తోటకూర గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఎర్ర తోటకూర గురించి మీకు తెలుసా.? ఎర్ర తోటకూర అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయ పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఏదొక ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. తోటకూర గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఎర్ర తోటకూర గురించి మీకు తెలుసా.? ఎర్ర తోటకూర అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయ పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, రాగి, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఎర్ర తోటకూరలో ఆంథోసైనిన్ అనే సమ్మేళనం శరీరాన్ని ఆక్సీకరణ నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

షుగర్ పేషంట్లు తమ రోజువారి ఆహారంలో ఎర్ర తోటకూరను చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు ఎర్ర తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఎముకలు, దంతాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తోటకూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. హైబీపీ పేషంట్లు ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్ గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎర్ర తోట‌కూరను వారానికి ఒకటి రెండు సార్లైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎర్రతోటకూర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఎర్ర తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.