
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. శరీరంలో శ్వాస సంబంధిత వ్యాధులు కేవలం ఊపిరితిత్తుల పనితీరుపైనే ఆధారపడి వస్తాయి. కాబట్టి మనం శ్వాస సంబంధిత సమస్యలకు గురైనప్పుడు కచ్చితంగా అలెర్ట్ కావాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొంత వయస్సు వచ్చాక దగ్గుతో ఇబ్బంది పడతారు. అయితే చాలా మంది ఇది వయస్సు పెరగడం వల్ల వచ్చే సాధారణ దగ్గే అని భావిస్తుంటారు. కానీ, అది ఊపిరితిత్తుల సమస్యను సూచించే సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి చిన్న చిన్న సమస్యలని మనంతట మనం భావించకుండా వైద్యులను సంప్రదించి సరైన వైద్య సాయం పొందాలని సూచిస్తున్నారు. అలాగే సాధారణంగా శ్వాస తీసుకున్నప్పుడు లైట్ గా వచ్చే గురక కూడా ప్రమాదమేనని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది సీపీఓడీ, ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా ఊపిరితిత్తుల రుగ్మతలకు మొదటి సంకేతంగా భావించాలి. కాబట్టి నిపుణులు సూచించే ఊపిరితిత్తుల వ్యాధుల ముందస్తు సంకేతాల గురించి ఓసారి తెలుసుకుందాం.
కనీసం ఎనిమిది వారాల పాటు కొనసాగే దగ్గు దీర్ఘకాలిక దగ్గుగా పరిగణించవచ్చు. ఈ కీలకమైన ప్రారంభ లక్షణం మీ శ్వాసకోశ వ్యవస్థతలో ఉండే సమస్య గురించి హెచ్చరికగా మనం చూడాలి.
వ్యాయామం చేసిన తర్వాత కూడా శ్వాస ఆడకపోవడం లేదా అధికంగా పని చేయడం వల్ల కూడా ఊపిరి ఆడకపోవడం కూడా ఊపిరితిత్తుల సమస్యను సూచిస్తుంది. కాబట్టి తరచూ ఇలాంటి సమస్యతో బాధపడేవారు వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
వాయుమార్గాలు చికాకులు లేదా వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కఫం అని పిలిచే శ్లేష్మాన్ని సృష్టిస్తాయి. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు శ్లేష్మం సమస్య ఉంటే అది ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం కావచ్చు. సో వెంటనే అప్రమత్తం కావడం మంచిది.
పడుకున్నప్పుడు శబ్దంతో కూడిన గురక పెట్టడం కూడా ఊపిరితిత్తుల సమస్యను సూచిస్తుంది. ఊపిరితిత్తులలోని వాయుమార్గాల్లో అసాధారణ అవరోధం లేదా సంకుచితం అయినప్పుడే గురక సమస్య వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
రోజుల తరబడి ఛాతిలో అసౌకర్యాన్ని అనుభవిస్తే ఊపిరితిత్తులు సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దగ్గినప్పుడు లేదా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ సమస్యను అనుభవిస్తుంటారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం