Vitamin D: విటమిన్‌ డి తక్కువగా ఉందా? ఈ వ్యాధులు వేధించే ఛాన్స్.. ఎలాంటి డైట్ తీసుకోవాలంటే..

| Edited By: Ravi Kiran

Jul 02, 2022 | 6:59 AM

Vitamin D: శరీరంలోని విటమిన్ డి తగిన స్థాయుల్లో ఉంటే గుండె జబ్బులు , క్యాన్సర్, మధుమేహంతో సహా అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. అలాగే ఈ విటమిన్ తో ఆటో ఇమ్యూన్ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులతో పాటు..

Vitamin D: విటమిన్‌ డి తక్కువగా ఉందా? ఈ వ్యాధులు వేధించే ఛాన్స్.. ఎలాంటి డైట్ తీసుకోవాలంటే..
Vitamin D
Follow us on

Vitamin D: శరీరంలోని విటమిన్ డి తగిన స్థాయుల్లో ఉంటే గుండె జబ్బులు , క్యాన్సర్, మధుమేహంతో సహా అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. అలాగే ఈ విటమిన్ తో ఆటో ఇమ్యూన్ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు, పరిశోధనల్లో తేలింది. అలాగే సూర్యరశ్మికి గురికాని వారు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. శరీరంలోని ప్రతి కణం విటమిన్ డిని గ్రహిస్తుంది కాబట్టి సూర్యరశ్మి శరీరాన్ని తాకినప్పుడు కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి మన శరీరంలో హార్మోన్ లా పనిచేస్తుంది.

గుండె జబ్బులతో పాటు..

విటమిన్ డి లోపం వల్ల స్థూలకాయం, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విటమిన్‌ తగిన స్థాయిలో లేకపోతే శరీరం మొత్తం బరువు పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలసట, కీళ్ల నొప్పులు బాగా ఇబ్బంది పెడతాయి. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల రక్తంలో చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది క్రమంగా డయాబెటిస్ సమస్యకు దారి తీస్తుంది. విటమిన్ డి శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఇదే కారణం. మహిళల్లో పీరియడ్స్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, శరీరంలో విటమిన్ డి స్థాయులను చెక్ చేసుకోవాలి. ఈ విటమిన్ లోపిస్తే ఎముకల సమస్యల కూడా తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్‌ డి లోపాన్ని అధిగమించండిలా..

ఇక డి విటమిన్‌ను పొందేందుకు ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల సూర్యకాంతి పొందడం ఉత్తమ మార్గం. అలాగే సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు, సోయా డ్రింక్స్‌, ఆరెంజ్‌ జ్యూస్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న లాంటివి తరచూ తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..