Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare Mask: డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా..? ఈ మాస్క్‌ను ఓ సారి ట్రై చేయండి.. ఫలితాలతో ఆశ్చర్యపోతారు..!

నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలలో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. చర్మం పొడిబారినా, ఆయిలీగా ఉన్నా నలుగురిలోకి రావడానికి..

Skincare Mask: డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా..? ఈ మాస్క్‌ను ఓ సారి ట్రై చేయండి.. ఫలితాలతో ఆశ్చర్యపోతారు..!
Coffee Face Mask
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 05, 2023 | 8:10 AM

మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలలో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. చర్మం పొడిబారినా, ఆయిలీగా ఉన్నా నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడుతూ.. ఏవేవో కాస్మటిక్స్ వాడుతుంటారు యువత. ఇక చలికాలంలో చర్మ సంరక్షణ అంటే మరింత సవాలుగా మారింది. అయితే చర్మ సంరక్షణ కోసం మన నిత్యం వాడే కాఫీ పొడి మంచి మూలకంగా ఉపయోగపడుతుంది.  కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ తొలగించి చర్మాన్ని శుభ్రంచేస్తాయి. దీంతోపాటు ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగించడంలో సహాయపడుతాయి. కాఫీ ఫేస్ ప్యాక్‌కి కొంచెం కొబ్బరి లేదా బాదం నూనెను కలిపి అప్లై చేయాలి. మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇది చాలా కాలం పాటు యవ్వనంగా, మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది.

కాఫీ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా కాఫీ పొడి తీసుకోండి. దీనిని మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. తరువాత ఒక గిన్నెలో తీసుకొని ఈ మిశ్రమానికి కొబ్బరి లేదా బాదం నూనె కలపాలి. తరువాత ఈ రెండింటినీ బాగా మిక్స్‌ చేయాలి. అంతే కాఫీ ఫేస్‌మాస్క్ తయారవుతుంది. అయితే ఇది అప్లై చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కాఫీ ఫేస్ మాస్క్‌ని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత ఫేస్ మాస్క్‌ని ముఖంపై బాగా అప్లై చేయాలి. సుమారు 15 నిమిషాలు అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని తుడిచిన తర్వాత మీరు తప్పనిసరిగా కొన్ని క్రీమ్ లేదా లోషన్‌ను అప్లై చేయాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..