
క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెట్ ను వంటల్లో, జ్యూస్ లా, సలాడ్స్ లా, నేరుగా ఎలాగైనా తీసుకోవచ్చు. క్యారెట్ ఎలా తీసుకున్నా బెనిఫిట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. కనీసం రోజుకి ఒక క్యారెట్ తిన్నా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. క్యారెట్ లో విటమిన్ ఏ, సి, కే, బీటా కెరోటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ కారణంగా మన కంటి చూపు మెరుగు పడుతుంది. వయసు పైబడిన తర్వాత వచ్చే కంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. రక్త హీనత లేకుండా చేస్తుంది క్యారెట్. క్యారెట్ వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు. క్యారెట్ ను ఫేస్ ప్యాక్ ల రూపంలో తీసుకుంటే మన అందం ఎంతో రెట్టింపు అవుతుంది. మరి క్యారెట్ తో అందాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ తో ఫేస్ ప్యాక్స్:
1. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల క్యారెట్ రసం, నాలుగు చుక్కల నిమ్మ రసం, కొద్దిగా బనానా గుజ్జు, కోడి గుడ్డు వైట్ సొన వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా రాసుకుని.. ఆరిపోయాక గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా పాటించడం వల్ల ముఖం గ్లోతో పాటు ముడతలు పోతాయి.
2. రెండు స్పూన్ల క్యారెట్ రసాన్ని ఓ చిన్న బౌల్ లోకి తీసుకుని అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖం అంతా రాసుకుని ఓ ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చటి వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఇలా క్యారెట్ తో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటిండం వల్ల ముఖం మరింత అందంగా, గ్లోగా మారుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.