Green Banana: పచ్చి అరటితో అబ్బురపరిచే ఆరోగ్య ప్రయోజనాలు.. షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంతో సహా ఆ సమస్యలకు చెక్‌

|

Oct 29, 2022 | 9:54 AM

అరటిపండును పచ్చిగా తినకూడదు. కానీ దాని నుండి తయారైన పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Green Banana: పచ్చి అరటితో అబ్బురపరిచే ఆరోగ్య ప్రయోజనాలు.. షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంతో సహా ఆ సమస్యలకు చెక్‌
Green Banana
Follow us on

ఆరోగ్యం విషయంలో అరటిపండుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోని పోషకాలతో పలు ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ పండును తరచూ తీసుకుంటే పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అందుకు తగ్గట్లే చిన్నా పెద్దా అందరూ అరటిపండును ఇష్టంగా తింటారు.ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ పచ్చి అరటి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి అరటిపండ్లు చాలా అవసరం. అయితే అరటిపండును పచ్చిగా తినకూడదు. కానీ దాని నుండి తయారైన పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అరటి కాయను వివిధ రకాల కర్రీల్లో వాడతారు. ఇక అరటి కాయ బజ్జీలు, బోండాల గురించి మాట్లాడాల్సిన పనిలేదు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అరటిపండు చిప్స్, అరటిపండు గుజ్జు, సాంబారు వంటివి కూడా చేసుకుంటే మంచిది.

కాగా ఇటీవల అరటి కాయలను ముక్కలుగా కోసి ఉప్పు వేసి వేయించే వారి సంఖ్య పెరిగింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ రకమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని పరిశోధనలో తేలింది. అలాగే ఇది జీర్ణక్రియలో మీకు సహాయపడుతుంది. శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే స్టార్చ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా పచ్చి అరటిలోని స్టార్చ్ శోషక ఫైబర్‌గా పనిచేస్తుంది. ఇది కాకుండా, జీర్ణవ్యవస్థ, శరీరం నుండి విషపూరిత పదార్థాలను తొలగిస్తుంది. అరటిపండు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. రక్తశుద్ధిలో సహాయపడుతుంది.

డయాబెటిస్ బాధితులకు సూపర్ ఫుడ్..

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక అరటిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ త్వరగా పొట్టను నింపుతుంది. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో పచ్చి అరటిపండు ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది తక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవచ్చు.అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది డయేరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది విరేచనాల లక్షణాలైన తలనొప్పి, వికారం, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అరటిపండులో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అరటిపండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది కాబట్టి పచ్చి అరటిపండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి