Health: పిచ్చి మొక్క అనుకునేరు.. రోజుకు 2 ఆకులు నమిలితే ఎలాంటి రోగమైనా మటాష్
తిప్ప తీగ ఆయుర్వేదంలో 'అమృతం'గా ప్రసిద్ది చెందింది. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. రోజు రెండు ఆకులను నమిలితే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్ప తీగ బెనిఫిట్స్ తెలుసుకుందాం పదండి...

హృదయాకారపు ఆకులతో ఉంటుంది. ఎర్రని పండ్లతో కనిపిస్తుంది. అదేనండీ తిప్పతీగ. ఆయుర్వేద నిపుణులు దీన్ని ఓ అద్భుతమైన మొక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. రోగ నిరోధక శక్తి పెంచడంలో నంబర్ వన్. ఈ ఆకులో ఇంకా ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. అలాగని అరుదుగా దొరికేది కాదు. గ్రామాలు, పట్టణాల్లో ఈ తీగలు కనిపిస్తూనే ఉంటాయి. దీని ఆకులు, కాయలు, పూలు, కాండం, వేర్లతో సహా అన్నిట్లో ఔషధ విలువలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగ ఆకులలో ఎక్కువగా యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తిప్పతీగ ట్యాబ్లెట్లు, సిరప్‌ల రూపంలో నేరుగానూ దొరుకుతోంది. తిప్ప తీగ వల్ల బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
-
- కామెర్లు సమస్యతో బాధ పడుతున్నవారికి మంచి ఔషదంగా పని చేస్తుంది.
- ఈ మొక్క కాండంలోని ఫైటోకెమికల్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను అడ్డుకుంటాయనీ తద్వారా కీళ్లవాపుల్ని నివారిస్తాయనీ తేలింది
- డయాబెటిస్ ను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఆర్థరైటిస్ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుంది.
- ఎసిడిటీ, దగ్గు సమస్యలను నయం చేస్తుంది.
- తిప్పతీగ పొడి అల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
- గోరువెచ్చని పాలల్లో పావు లేదా అరటీస్పూను తిప్పతీగ పొడి వేసుకుని తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు
- ఈ తీగ కాండం, కాస్త పసుపు, అల్లం, బెల్లం, తులసి ఆకులు అన్నీ కలిపి తీసిన రసాన్ని అన్నం తినడానికి ముందు టీస్పూను చొప్పున తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
- ఒత్తిడి, మానసిక ఆందోళనతో ఇబ్బంది పడేవాళ్లకు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది.
- తిప్పతీగతో మూత్ర సంబంధిత రోగాలు నయం అవుతాయి
- ఈ ఆకుతో.. యూరిక్ యాసిడ్ సమస్య ఈజీగా తగ్గుతుంది.
గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు, తిప్పతీగ వాడితే ప్రమాదం అని అంటారు. అందుకే ఎవరైనా సరే తిప్పతీగ తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




