Irregular Periods: PCOD లేకపోయినా పీరియడ్స్‌ సక్రమంగా రావట్లేదా? కారణం ఇదే..

|

Mar 01, 2024 | 1:01 PM

పీరియడ్స్‌ సమయంలో మూడ్ స్వింగ్స్, పొత్తి కడుపు నొప్పి, కండరాల నొప్పి, ఉబ్బరం, రొమ్ము నొప్పి వంటి పలు రకాల సమస్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఋతుస్రావం ముగియడంతో ఈ సమస్యలు కూడా అదృశ్యమవుతాయి. సాధారణంగా ఈ లక్షణాలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కనిపిస్తాయి. అయితే చాలా మంది క్రమరహిత పీరియడ్స్‌తో బాధపడుతుంటారు. హార్మోన్ల వైవిధ్యాలు లేదా PCOD లేదా PCOS వంటి పరిస్థితుల..

Irregular Periods: PCOD లేకపోయినా పీరియడ్స్‌ సక్రమంగా రావట్లేదా? కారణం ఇదే..
Periods
Follow us on

పీరియడ్స్‌ సమయంలో మూడ్ స్వింగ్స్, పొత్తి కడుపు నొప్పి, కండరాల నొప్పి, ఉబ్బరం, రొమ్ము నొప్పి వంటి పలు రకాల సమస్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఋతుస్రావం ముగియడంతో ఈ సమస్యలు కూడా అదృశ్యమవుతాయి. సాధారణంగా ఈ లక్షణాలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కనిపిస్తాయి. అయితే చాలా మంది క్రమరహిత పీరియడ్స్‌తో బాధపడుతుంటారు. హార్మోన్ల వైవిధ్యాలు లేదా PCOD లేదా PCOS వంటి పరిస్థితుల కారణంగా ప్రతి నెలా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం జరుగుతుంది. అలాగే అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడేవారిలో కూడా క్రమరహిత పీరియడ్స్‌ సంభవిస్తుంటుంది. అల్సరేటివ్ కొలిటిస్ అనేది ఒక రకమైన దీర్ఘకాలిక ప్రేగు వ్యాధి. ఇది జీర్ణాశయంలో మంట, అల్సర్లకు కారణమవుతుంది. పెద్దప్రేగు, పురీషనాళం వాపు వల్ల అసాధారణ కడుపు నొప్పి, పేగు పూత, అతిసారం, మల రక్తస్రావం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం నుంచి అనువంశికత వరకు ఈ వ్యాధి అభివృద్ధి చెందడానికి పలు కారణాలుగా చెప్పవచ్చు. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేయడం, మెడిసిన్‌ ద్వారా కూడా కోలుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

రుతుక్రమం వచ్చే స్త్రీలలో అల్సరేటివ్ కొలిటిస్ లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలసట, తలనొప్పి, ఆందోళన, చిరాకు, వికారం, వాంతులు, కాలు వాపు, వెన్నునొప్పి, మలబద్ధకం, తరచుగా మూత్రవిసర్జన, అసాధారణ నొప్పులు మొదలైనవి దీని ప్రధాన లక్షణాలు. అల్సరేటివ్ కొలిటిస్- క్రమరహిత పీరియడ్స్‌కు ఎలా సంబంధం కలిగి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతుంటే.. తరచుగా క్రమరహిత పీరియడ్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత.. రోగనిరోధక వ్యవస్థ, జీర్ణశయాంతర పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతున్న రోగులలో వాపును పెంచుతుంది. ఫలితంగా ఋతుస్రావం సమయంలో పొత్తి కడుపు నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది. అతిసారం, మల రక్తస్రావం వంటి లక్షణాలు ఈ సమయంలో మరింత తీవ్రమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇన్ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సగం మంది మహిళలు ఋతుస్రావం సమయంలో అల్సరేటివ్ కొలిటిస్‌ లక్షణాలతో బాధపడుతుంటారు.1200 మంది మహిళలపై అల్సరేటివ్ కొలిటిస్, క్రమరహిత ఋతుస్రావం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఋతు చక్రాన్ని అల్సరేటివ్ కొలిటిస్ ప్రభావితం చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పీరియడ్స్‌ సమయంలో పేగు మంట మరింత పెరుగుతున్నట్లు కనుగొన్నారు. అల్సరేటివ్ కొలిటిస్ లక్షణాలను చికిత్సతో నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చికిత్స అనంతరం రుతుక్రమం సక్రమంగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని తాజా ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.