బరువు తగ్గాలని ఉందా..? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
బరువు తగ్గాలంటే మన ఆహారపు అలవాట్లే కీలకం. ఎక్కువ కొవ్వు, చక్కెర ఉన్న పదార్థాల బదులు, పోషకాలు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే నట్స్, సీడ్స్ లను మీ డైట్‌లో చేర్చుకోండి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అంతేకాదు ఇవి ఆకలిని తగ్గిస్తాయి. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించి.. బరువును నియంత్రణలో ఉంచుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు అధిక కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలకు.. అలాగే నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బదులుగా, తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాలను తమ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ విషయంలో నట్స్, సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి.
బాదం
బాదంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. నానబెట్టిన బాదం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తూ బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.
వాల్‌నట్స్
వాల్‌నట్స్ లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. దీని వల్ల అతిగా తినే అలవాటు తగ్గుతుంది.
పిస్తా పప్పులు
100 గ్రాముల పిస్తాలో దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఒక మంచి స్నాక్.
చియా సీడ్స్
ఫైబర్ ఎక్కువగా ఉండే చియా సీడ్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.
అవిసె గింజలు
అవిసె గింజలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. వీటిని మీ రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
ఈ నట్స్, సీడ్స్ లను మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మీరు బరువు తగ్గడంతో పాటు.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందించవచ్చు. అయితే వీటిని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవడం ముఖ్యం. ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లయితే.. డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




