Garlic Side Effects: వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..

మసాలా దినుసు.. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. వెల్లుల్లి.. అనేక రకాల సమస్యలకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని భారతీయ వంటశాలలలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి మన ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పలు సమస్యలకు ఇంటి నివారణగా కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లి అనేక వ్యాధులను నయం చేస్తుంది.

Garlic Side Effects: వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
Garlic Side Effects
Follow us

|

Updated on: Feb 20, 2024 | 9:47 PM

మసాలా దినుసు.. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. వెల్లుల్లి.. అనేక రకాల సమస్యలకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని భారతీయ వంటశాలలలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి మన ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా పలు సమస్యలకు ఇంటి నివారణగా కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లి అనేక వ్యాధులను నయం చేస్తుంది. అయితే, వెల్లుల్లి రుచికరంగా లేదా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు దాగున్న వెల్లుల్లిలో ప్రతికూలతలు కూడా దాగున్నాయి.. మీరు కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులే.. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తం పలుచబడటం లాంటి సమస్య ఏర్పడుతుంది. వెల్లుల్లిని రోజూ తింటే ఎంత మేలు చేస్తుందో, అతిగా తినడం వల్ల అంతే నష్టాలు కలుగుతాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్ప రక్తపోటు (లోబీపీ) : అధిక రక్తాన్ని అదుపులో ఉంచుకోవడానికి పచ్చి వెల్లుల్లి తినడం మేలు చేస్తుంది. కానీ రోజూ ఎక్కువ తింటే రక్తపోటు తగ్గి.. లోబీపీకి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల, పచ్చి వెల్లుల్లిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి.

జీర్ణక్రియ: ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది. వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా, మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.

గుండెలో మంట: వెల్లుల్లి వేడి స్వభావాన్ని కలిగి ఉండటం, దానిని ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ఇది కాకుండా, ఇప్పటికే గ్యాస్ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తినకూడదు. దీని కారణంగా, గుండెలో మంట సమస్య ఏర్పడుతుంది.

రక్తస్రావం: పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల మన రక్తం పలచబడుతుంది. వెల్లుల్లిలో రక్తాన్ని పలుచగా.. చేసే అంశాలు ఉంటాయి. ఇంకా కొన్ని మందులు వాడుతున్నట్లయితే, పచ్చి వెల్లుల్లిని తినకపోవడమే మంచిది.

ఎంత మోతాదులో వెల్లుల్లి తినాలి..

రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దీని కంటే ఎక్కువ వెల్లుల్లి మీ ఆరోగ్యానికి హానికరం.. అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..