AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health: పేగు ఆరోగ్యం కోసం పెరుగన్నం తినాల్సిందే.. ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా..?

మన శరీర ఆరోగ్యం గట్ పై ఆధారపడి ఉంటుంది. గట్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంాయి. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు,పురీష నాళం, పాయువు వరకు గట్ అనేది ఉంటుంది.

Gut Health: పేగు ఆరోగ్యం కోసం పెరుగన్నం తినాల్సిందే.. ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా..?
Gut Health
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 20, 2023 | 5:23 PM

Share

మన శరీర ఆరోగ్యం పేగు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పేగు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు,పురీష నాళం, పాయువు వరకు పేగు వ్యవస్థ అనేది ఉంటుంది. పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే..జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేగు సమస్యల కారణంగా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోన వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు తగిన మొత్తంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే పేగు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

దక్షిణభారత వంటకాల్లో పెరుగన్నం చాలా ముఖ్యమైంది. మనలో చాలామంది అన్నం తిన్న తర్వాత చివర్లో పెరుగన్నం తింటారు. పెరుగు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉండే ప్రోబయెటిక్ ఉత్పత్తి చేస్తుంది. అన్నం అధిక ప్రోటీన్ కలిగి ఆహారం. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మొత్తంగా పెరుగు అన్నం జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు జీర్ణసమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కళ్ళకు, చర్మానికి పోషణను అందిస్తుంది. రోజూ పెరుగు అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు అన్నం తింటే కలిగే ప్రయోజనాలు:

1) లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనే బ్యాక్టీరియా పెరుగు అన్నంలో ఉంటుంది. ఈ బాక్టీరియా ప్రేగులు, కడుపు లోపలి పొరపై పని చేస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

2) వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. చప్పగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచిది.

3) పెరుగు అన్నం విశ్రాంతికి ఉపకరిస్తోంది. ఇందులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవన్నీకూడా ఒత్తిడిని దూరం చేస్తాయి.

4) పెరుగు అన్నంలో చర్మానికి మేలు చేసే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. సులభంగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ పెరుగు అన్నం తింటే మీ చర్మంపై మచ్చలు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

5 ) ఈ రైస్ డిష్‌లో తక్కువ ఉప్పు ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ పెరుగు అన్నం తీసుకోవాలి.

6) ప్రతిరోజు గిన్నె పెరుగు అన్నం తింటే శరీరానికి తగినంత శక్తి లభిస్తోంది. పెరుగులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ద్వారా విచ్ఛిన్నమై శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఆరోగ్య వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.