Relationship Tips: ఇలాంటి భర్తలతో భార్యలకు కష్టమే.. వాళ్లను అసహ్యించుకుంటారట!!

వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ప్రేమ చాలా ముఖ్యం. వీటితో పాటు కాస్త సహనం కూడా ఉండాలి. భార్యాభర్తల మధ్య అస్సలు ఇగోలకు చోటు ఇవ్వకూడదు. వీటితో పాటు అవగాహన, బంధం, మంచి మాటలు ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తుంది. దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నా..

Relationship Tips: ఇలాంటి భర్తలతో భార్యలకు కష్టమే.. వాళ్లను అసహ్యించుకుంటారట!!
Relationship Tips
Follow us
Chinni Enni

|

Updated on: Jul 28, 2023 | 1:34 PM

వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ప్రేమ చాలా ముఖ్యం. వీటితో పాటు కాస్త సహనం కూడా ఉండాలి. భార్యాభర్తల మధ్య అస్సలు ఇగోలకు చోటు ఇవ్వకూడదు. వీటితో పాటు అవగాహన, బంధం, మంచి మాటలు ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తుంది. దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా వారి మధ్య మనస్పర్థలు కామన్. అయితే ఒక్కోసారి చిన్న చిన్నవే చాలా పెద్దగా తయారవుతాయి. కాబ్టటి కొన్నింటికి ఎక్కడికక్కడ వదిలేయడం మంచింది.

కానీ అలాగని ఒకరు అరవడం.. మరొకరు తగ్గడం ఉండకూడదు. అలా అయితే వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలబడదు. చాలా మంది భార్యాభర్తలు కేవలం పిల్లల కోసమే వారు డివోర్స్ తీసుకోకుండా ఉంటారు. కానీ వారు నిత్యం బాధపడుతూనే ఉంటారు. అయితే కేవలం భార్యలే కాదు.. భర్తలు ఇలా చేసినా కూడా భార్యలకు కష్టంగా ఉంటుంది. వాళ్లను అసహ్యించుకుంటారు. మరి అవేంటో తెలుసుకోండి.

-వేధింపులు అనేవి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఉంటాయి. స్త్రీని బాధపెడుతుంది. దాని నుండి ఆమె జీవితాంతం కోలుకోలేదు. ఇంతగా వేధించిన భర్త గుండెల్లో ప్రేమ ఎలా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

– ఏదైనా సంబంధాల్లో ప్రేమ, సెక్స్ కంటే జంట మధ్య నిజాయితీ చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడని పునాది ఇది. ఇలాంటి పరిస్థితుల్లో భర్త మోసం చేస్తున్నాడని భార్యకి తెలిస్తే అస్సలు భరించలేదు. దీంతో వారి వివాహ బంధం రెండు ముక్కలు అవుతుంది.

-అదే విధంగా భార్యాభర్తలు బాగున్నప్పటికీ పిల్లల్ని ఇబ్బంది పెడితే ఏ స్త్రీ కూడా సహించదు. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది. అందుకే, పిల్లల్ని ఇబ్బంది పెట్టే మగవారిని ఎవరు ఇష్టపడరు.

-భార్యను కొట్టే భర్తను ఏ భార్య ఇష్టపడుతుంది. దీనిని ఎవరూ ఇష్టపడరు. దీనికి వ్యతిరేకంగా చట్టాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల మహిళలకి న్యాయం జరుగుతుంది. అయితే, ఏ విషయంలో అయినా సరే భార్యపై చేయి ఎత్తితే వారికి అస్సలు నచ్చదు.

-భార్యల ఇష్టాలను గౌరవించాలి. వారు ఏం చెబుతున్నారో విని ఆలోచించి మాట్లాడాలి. భర్తలు చిరాకుపడినా.. సరిగ్గా మాట్లాడకపోయినా కూడా దంపతలు మధ్య సఖ్యత ఉండదు. ఇలాంటా వారిని కూడా భార్యలు అసహ్యించుకుంటారట.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి