Garlic Side Effects: హెల్త్ అలెర్ట్.. ఈ సమస్యలుంటే వెల్లుల్లి బంద్ పెట్టాల్సిందే.. తింటే పెనుప్రమాదమే..

|

Apr 20, 2023 | 9:50 AM

వంటగదిలోని అనేక మసాలా దినుసులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లిని ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆహారంగా పరిగణిస్తారు.

Garlic Side Effects: హెల్త్ అలెర్ట్.. ఈ సమస్యలుంటే వెల్లుల్లి బంద్ పెట్టాల్సిందే.. తింటే పెనుప్రమాదమే..
Garlic Benefits
Follow us on

వంటగదిలోని అనేక మసాలా దినుసులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లిని ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆహారంగా పరిగణిస్తారు. ఇది అతిపెద్ద వ్యాధిని సైతం నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది కొంతమందికి హానికరం. కొన్ని వ్యాధులలో వెల్లుల్లి తినడం హానికరం అని వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఎలాంటి వ్యక్తులు వెల్లుల్లిని తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ సమస్యలున్న వారు వెల్లుల్లిని తినకూడదు..

మధుమేహం: మధుమేహ రోగులు వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే దీన్ని అధికంగా తీసుకోవడం హానికరం. ఎందుకంటే దీన్ని అధికంగా తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది, దీని కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

జీర్ణ, కాలేయ సమస్యలు: కాలేయం, ప్రేగులు లేదా కడుపుతో సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే వెంటనే తగ్గించడం మంచిది. ఎందుకంటే మీరు కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, వెల్లుల్లిలోని కొన్ని మూలకాలు కాలేయాన్ని నయం చేయడానికి ఇచ్చిన మందులతో ప్రతిస్పందిస్తాయి. దాని కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

శస్త్రచికిత్స చేయించుకున్నవారు: శస్త్రచికిత్స చేయించుకున్న వారు వెల్లుల్లిని తినకుండా ఉండాలి. ఎందుకంటే వెల్లుల్లిని నేచురల్ బ్లడ్ థిన్నర్ అని అంటారు. అంటే రక్తాన్ని పల్చగా మార్చే పని చేస్తుంది. కాబట్టి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న వారు దీనిని తినకుండా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..