వామ్మో.. వాటిని పచ్చిగానే తినేస్తున్నారా..? అవి పాము విషంకన్నా డేంజర్..!

కూరగాయలు, పండ్లు ‘పచ్చిగా తింటేనే ఆరోగ్యం’ అని చాలామంది నమ్ముతారు. అని ఎంతమంది చెబుతారో… కానీ ఒక్కోసారి ఆ పచ్చటి పండ్లూ కూరగాయలూ పాము కాటు కంటే వేగంగా ప్రాణం తీసేస్తాయని తెలుసా? కానీ కొన్ని పండ్లు, కూరగాయల్లో సహజంగానే శరీరానికి హానికరమైన ..

వామ్మో.. వాటిని పచ్చిగానే తినేస్తున్నారా..? అవి పాము విషంకన్నా డేంజర్..!
Fruits

Edited By: Janardhan Veluru

Updated on: Dec 04, 2025 | 1:54 PM

కూరగాయలు, పండ్లు ‘పచ్చిగా తింటేనే ఆరోగ్యం’ అని చాలామంది నమ్ముతారు. అని ఎంతమంది చెబుతారో… కానీ ఒక్కోసారి ఆ పచ్చటి పండ్లూ కూరగాయలూ పాము కాటు కంటే వేగంగా ప్రాణం తీసేస్తాయని తెలుసా? కానీ కొన్ని పండ్లు, కూరగాయల్లో సహజంగానే శరీరానికి హానికరమైన టాక్సిన్స్ ఉంటాయి. వీటిని పచ్చిగా తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, విషప్రయోగం, కిడ్నీ సమస్యలు, రక్తహీనత, గుండె సమస్యలు కూడా రావచ్చు.

పాము విషం కంటే కూడా కొన్ని ఆహారపదార్థాల్లో ఎక్కువ విషపూరితమైన టాక్సిన్స్​ ఉంటాయంటున్నారు నిపుణులు. ఇంట్లో రోజూ వాడే కొన్ని ఆహారాల్లో సహజంగానే సయానైడ్, సోలనైన్, లెక్టిన్ వంటి ఘోరమైన విషాలు దాగుంటాయి. ఏ పండ్లు, కూరగాయలను పచ్చిగా తినకూడదో తెలుసుకుందాం..

  • చిన్న అరటిపండ్లు పూర్తిగా పండనప్పుడు చాలా టానిన్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన టాక్సిన్. ఎక్కువ మొత్తంలో తింటే నోటి పుండ్లు, గొంతు మంట, తీవ్రమైన అజీర్తి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  •  మార్కెట్‌లో దొరికే ‘పచ్చి కాజు’ అసలు పచ్చివి కావు – వాటిని ఆవిరితో లేదా కాల్చి టాక్సిన్ తొలగించి అమ్ముతారు. నిజంగా పచ్చి కాజు తింటే అందులో ఉండే యురుషియాల్ అనే రసాయనం పాయిజన్ ఐవీ కంటే పది రెట్లు ప్రమాదం. చర్మం మీద పడితే బొబ్బలు, లోపల తింటే గొంతు వాపు, శ్వాస తీసుకోలేనంత స్థితి కలుగుతుంది.
  •  పచ్చి బంగాళదుంపలో సొలనైన్​ అనే గ్లైకోఆల్కలాయిడ్ టాక్సిన్ ఉంటుంది. ముఖ్యంగా మొలకెత్తిన బంగాళదుంపల్లో ఇది భారీ మోతాదులో ఉంటుంది. తలనొప్పి, వికారం, డయేరియా, నరాల దెబ్బతినడం, తీవ్రమైన కేసుల్లో మరణం కూడా సంభవించింది.

    Raw Banana And Ackie Fruit

  •  కేవలం 4–5 పచ్చి రాజ్మ గింజలు తింటేనే ఫైటోహెమాగ్గ్లుటినిన్ అనే లెక్టిన్ వల్ల తీవ్రమైన విషప్రయోగం. లక్షణాలు 1–3 గంటల్లోనే మొదలై వాంతులు, డయేరియా, పొట్ట నొప్పి వస్తాయి. వీటిని 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
  •  పండని అక్కీ(Ackee Fruit) పండ్లలో హైపోగ్లైసిన్ A & B టాక్సిన్స్ ఉంటాయి. దీన్ని ‘జమైకన్​ వామిటింగ్​ సిక్​నెస్​’ అంటారు. దీనివల్ల బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పడిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది, మరణం కూడా సంభవించవచ్చు.
  •  పచ్చి బీన్స్​, క్లస్టర్​ బీన్స్​ వంటివాటిలో లెక్టిన్స్​ ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చిగా ఎక్కువ తింటే జీర్ణసమస్యలు, గ్యాస్, విషప్రయోగం అవకాశం ఉంది.
  •  తీపి బాదంలో లేని అమిగ్డాలిన్ అనే సమ్మేళనం పచ్చి బాదంలో ఉంటుంది. శరీరంలో ఇది సయానైడ్‌గా మారుతుంది. 7–10 పచ్చి చేదు బాదం తినడం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
  • కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు పచ్చి స్టార్​ఫ్రూట్స్​ లేదా, ఎక్కువ మొత్తంలో తిన్నా వీటిలో ఉండే ​కారంబాక్సిన్ వల్ల మెదడు దెబ్బతిని, మూర్ఛ, మరణం వంటి ప్రమాదాలు ఉన్నాయి. పచ్చి మామిడిలోనూ యురుషియాల్ ఉంటుంది. దీనివల్ల చాలా మందికి అలర్జీ వచ్చి నోటి చుట్టూ దద్దుర్లు, గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది.

బీన్స్, రాజ్మ, సెనగలు కనీసం 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాతే తినాలి. మొలకెత్తిన బంగాళదుంపలు, పచ్చగా ఉన్న బంగాళదుంపలు తినకూడదు. కిడ్నీ సమస్యలు ఉంటే స్టార్​ ఫ్రూట్స్ పూర్తిగా మానేయాలి. పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిదే… కానీ ‘ఏది పచ్చిగా తినొచ్చు, ఏది తినకూడదు’ అనే జ్ఞానం లేకుండా తినడం ప్రమాదం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. తెలివిగా ఎంచుకోండి!

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.