Drinking less water: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలో తగినంత నీరు ఉండాలన్న విషయం అందరికీ తెలుసు. నీరు తాగకపోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (Dehydration) సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే మన శరీరంలో కేవలం 60 శాతం నీరు మాత్రమే ఉంటుంది. కావున శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు నీటిని తప్పనిసరిగా తాగాలని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. నీటి కొరత వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడతారో ఇప్పుడు తెలుసుకోండి..
శరీరంలో నీటి కొరత వల్ల వచ్చే సమస్యలు..
ఊబకాయం సమస్య: ఊబకాయం అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో తక్కువ నీరు తాగడం ఊబకాయాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది. అదే సమయంలో మనం సరైన మొత్తంలో తింటాము, కానీ నీరు తాగము. దీని కారణంగా మనకు ఎల్లప్పుడూ ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల మనం అతిగా తింటాం.. దీంతో బరువు పెరుగుతూ పోతుంది. కావున మీకు కూడా తక్కువ నీరు తాగే అలవాటు ఉంటే ఈ అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు.
నోటి దుర్వాసన: శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల కూడా నోటిలో హాలిటోసిస్ సమస్య వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా పెరిగి నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో నోటి దుర్వాసనను నివారించడానికి నీరు గ్యాప్ లేకుండా తాగుతుండాలి.
మొహం అందాన్ని కోల్పోతారు: తక్కువ నీరు తాగే అలవాటు ఉంటే క్రమంగా ముఖం అందాన్ని కోల్పోవచ్చు. అంతే కాదు శరీరంలో నీరు లేకపోవడం వల్ల ముఖంపై మొటిమల సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ముఖాన్ని మెరిసేలా చేయాలంటే సరైన మొత్తంలో నీరు తాగటం అవసరం. నీరు తక్కువగా ఉండటం వల్ల ముఖం కూడా అలసిపోయినట్లు కనిపిస్తోంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి