Butter Milk: బటర్ మిల్క్‌ మంచిదని తెగ తాగేస్తున్నారా.? ఈ నష్టాలు తప్పవు..

|

Nov 25, 2023 | 3:25 PM

సాధారణంగా పాలతో తయారయ్యే పదార్థాల్లో లాక్టోజ్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ జీర్ణమవ్వదు. కొందరికి ఈ లాక్టోజ్‌ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కాదు. అలాంటి వారు బటర్‌ మిల్క్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు బటర్‌ మిల్క్‌ను ఎక్కువగా తీసుకుంటే.. కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో...

Butter Milk: బటర్ మిల్క్‌ మంచిదని తెగ తాగేస్తున్నారా.? ఈ నష్టాలు తప్పవు..
Butter Milk Side Effects
Follow us on

Butter Milk Side effects: మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బటర్‌ మిల్క్‌ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా బటర్‌ మిల్క్‌ ప్రయోజనాల గురించి తెలిపారు. జీర్ణ వవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు మజ్జిగతో చెక్‌ పెట్టొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని బటర్‌ మిల్క్‌ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బటర్‌ మిల్క్‌ను మోతాదుకు మించి తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పాలతో తయారయ్యే పదార్థాల్లో లాక్టోజ్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ జీర్ణమవ్వదు. కొందరికి ఈ లాక్టోజ్‌ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కాదు. అలాంటి వారు బటర్‌ మిల్క్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు బటర్‌ మిల్క్‌ను ఎక్కువగా తీసుకుంటే.. కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక మరికొందరిలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పాలలో ఉండే ప్రోటీన్లు పడకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు ఒక గ్లాస్‌కి మించి బటర్‌ మిల్క్‌ను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అతిగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక కొందరు మజ్జిగలో అతిగా ఉప్పు వేసుకుంటారు. తెలియకుండానే ఉప్పు ఎక్కువగా పడుతుంది. అయితే ఇలా నిత్యం తాగుతుంటే శరీరంలో ఉప్పు నిల్వ పెరిగిపోతుంది. దీంతో క్రమేణ హైబీపీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో వీలైనంత వరకు మజ్జిగను తీసుకోకుండా ఉండడమే మంచిది. వేసవిలో అయితే రెండు గ్లాసులు తీసుకున్నా పర్లేదు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..