Mouth Ulcers: నోట్లో పుండ్లు పడ్డాయా? బాధ భరించలేకపోతున్నారా? అయితే ఇంట్లో ఉండే వాటిని ఎంచక్కా నయం చేసుకోండి!
సాధారణంగా ఈ నోటి పుండ్లు వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి వాటిని మరింత వేగంగా తగ్గించడంతో పాటు ఆ బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

ఏదేనా పుల్లటి, ఉప్పటి లేదా మసాలా వేసిన కూరలు లేదా పండ్లు తినేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? నాలుక మంటపెట్టిపోతోందా? నోరు తీవ్రమైన అసౌకర్యాన్ని కల్గిస్తుందా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఎందుకంటే అది అల్సర్ కావచ్చు. నోటి పుండు ఏర్పడితే సహజంగా ఇటువంటి ఇబ్బందులు కల్గిస్తాయి. సాధారణంగా ఈ నోటి పుండ్లు వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి వాటిని మరింత వేగంగా తగ్గించడంతో పాటు ఆ బాధ నుంచి విముక్తి పొందవచ్చు.. అవేంటో ఓ సారి చూద్దాం.
నోటి పుండ్లు అంటే..
నోటి పుండ్లను సాధారణంగా నోటి పూతలు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా పెదవుల లోపలి వైపు, చిగుళ్లు, నాలుక, అంగిలి లేదా గొంతు లోపల తరచుగా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఆహారాన్ని నమలడం చాలా సవాలుగా మారుతుంది. ముఖ్యంగా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పలు సందర్భాల్లో అయిన నోటి గాయాల కారణంగా ఇవి ఏర్పడతాయి. ఇవి ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో బొబ్బలు ఎక్కి కనిపిస్తాయి. ఇది వచ్చినప్పుడు ఆహారాన్ని నమలడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ప్రాంతం అంతా మంట పెడుతుంది. ఆకలిని కోల్పోతాం. దీనిని నివారించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
సులభమైన ఇంటి చిట్కాలు..
సాల్ట్ గార్గ్లింగ్: గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు కలిపి బాగా పుక్కిలించాలి. ఆ తర్వాత మళ్లీ మమూలు నీటితో పుక్కించాలి. ఇలా చేయడం వద్ల నోటిలోని అసౌకర్యం, బాధ తగ్గుతుంది.
లవంగం నూనె: లవంగంలోని యూజీనాల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా వివిధ రకాల నోటి పరిశుభ్రత ఉత్పత్తుల్లో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు. నోటి పూతల నుంచి ఉపశమనం పొందడానికి లవంగం నూనెను నేరుగా పుండుపై పూయాలి. కొద్ది సేపటి తర్వాత నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సి లోపం వల్ల నోటిపూత ఏర్పడవచ్చు. సిట్రస్ వంటకాల్లో పుష్కలంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకని రెండు గ్లాసుల నారింజ రసం తీసుకుని రోజూ వాడాలి.
తేనె: అల్సర్‌లకు తేనె కూడా మంచి మందు. దీనిని పుండ్లపై పూసి కొన్ని గంటలపాటు అలాగే వదిలేయాలి. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఏదైనా గాయాన్ని నయం చేయడంలో బాగా సహకరిస్తుంది.
కొబ్బరి నూనె: ప్రతి ఇంటిలో ఉండే కొబ్బరి నూనె కూడా నోటి పూతలపై బాగా పనిచేస్తుంది. పడుకునే ముందు పుండు మీద నూనె రాయాలి. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా అది నయం అవుతుంది.
పసుపు: యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా పసుపు అంటువ్యాధులతో పోరాడటమే కాకుండా నోటి పుండు నొప్పి, మంటను తగ్గించడంలో బాగా ఉపయుక్తంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..







