Dolo 650 : డోలో 650.. ఈ ట్యాబ్లెట్ పేరు తెలియని వారు ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా కరోనా (Corona) మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ పేరు మారుమోగుతోంది. ఒంట్లో ఏ మాత్రం నలతకగా అనిపించినా వెంటనే ఓ డోలో వేసేయ్ అనే సలహా ఇచ్చేస్తున్నారు. చాలా సులభంగా అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో త్వరగా ఫలితం ఉండడంతో దీని వాడకం బాగా పెరిగిపోయింది. డోలో 650 ట్యాబ్లెట్‌పై నెట్టింట ఎలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్యాబ్లెట్ పేరు ట్రెండింగ్ మారింది. అయితే వెనకా ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటున్న ఈ ట్యాబ్లెట్‌తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా.?
నిజానికి డోలో ట్యాబ్లెట్‌ను కూడా వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి. అయితే చాలా మంది నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్ తెచ్చుకొని చాక్లెట్లలా వేసేసుకుంటున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డోలోని ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ఇంతకీ డోలోను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ఎదురయ్యే సమస్యలు ఏంటనేగా.. 650 ఎమ్‌జీ అంటే చాలా ఎక్కువ డోస్‌తో కూడుకున్న ట్యాబ్లెట్, వీటిని మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో వికారం కలుగుతుంది. అలాగే కొందరిలో లోబీపీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక తల తిరగడం, నీరసంగా అనిపించడం, నిద్రమత్తుగా ఉండడం, మల బద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి.
ఇక డోలోను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కొందరిలో మలబద్దకం, స్పృహ తప్పిపోతున్నట్లు భావన కలుగుతుంది. అలాగే నోరు పొడిగా మారిపోతుంది. కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరీ పరిమితి మించితే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొందరిలో గుండె కొట్టుకునే వేగం పెరగడం, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జ్వరంగా అనిపించగానే డోలో వేసుకోకుండా ఇతర మార్గాలను అన్వేషించడం ఉత్తమం. జ్వరం, ఒంటి నొప్పి, తలనొప్పి ఎంతకీ తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా.. మళ్లీ ఆరు వేలకు పైగా కేసులు.. మరిన్ని ఆంక్షల దిశగా సర్కార్!
Viral Video: మ్యాగీతో ఐస్‌క్రీమ్ ఏంటి సామీ.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..