Viral Video: మ్యాగీతో ఐస్‌క్రీమ్ ఏంటి సామీ.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..
Viral Video: కాదేదీ క్రియేటివిటీకి అనర్హం అన్నట్లు మారుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఈ పంథా ఎక్కువవుతోంది. కొత్తగా ఆలోచిస్తూ కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇక ప్రపంచం అంతా అర చేతిలో ఇమిడి పోయిన ఈ రోజుల్లో రోజులో వందల సంఖ్యలో..
Viral Video: కాదేదీ క్రియేటివిటీకి అనర్హం అన్నట్లు మారుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఈ పంథా ఎక్కువవుతోంది. కొత్తగా ఆలోచిస్తూ కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇక ప్రపంచం అంతా అర చేతిలో ఇమిడి పోయిన ఈ రోజుల్లో రోజులో వందల సంఖ్యలో వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తమలోని నటన ట్యాలెంట్‌ను బయటపెడుతోన్న వారు కొందరైతే, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న వారు మరి కొందరు. ముఖ్యంగా వంటల వీడియోలు ప్రస్తుతం బాగా పాపులర్ అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలను పరిచయం చేస్తూ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.
మ్యాగీ అంటే మనలో చాలా మంది ఇష్టపడుతుంటారు. క్షణాల్లో రెడీ అవుతుండడం, ఎక్కువ శ్రమించాల్సిన అవసరం కూడా లేకపోవడంతో బ్యాచిలర్స్ సైతం మ్యాగీ చేసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ మ్యాగీతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది. అందేంటి ఐస్‌క్రీమ్ తియ్యగా ఉంటుంది, మ్యాగీ కారంగా ఉంటుంది. ఆ రెండింటిని ఎలా కలుపుతారనేగా మీ సందేహం. అలా చేశారు కాబట్టే ప్రస్తుతం ఈ మ్యాగీ ఐఎస్‌క్రీమ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఓ ఔత్సాహిక ఐస్‌క్రీమ్ మేకర్ ముందుగా రడీ చేసిన మ్యాగీని తీసుకున్నాడు. అనంతరంలో అందులో క్రీమ్‌ను పోసి మ్యాగీని స్మాష్ చేసి అనంతరం వాటిని ఐస్‌క్రీమ్ రోల్స్‌గా మార్చేశాడు.
దీనంతటికీ వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది మ్యాగినీ దుర్వినియోగం చేయడం అవుతుంది అనే ఫన్నీ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. మ్యాగీతో ఐఎస్‌క్రీమ్ చేయడమేంటని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ ఐఎస్‌క్రీమ్ టేస్ట్ చేసి చూడాలి ఉందంటూ స్పందిస్తున్నారు. మరి ఈ మ్యాగీ ఐస్‌క్రీమ్ వీడియోను మీరూ చూసేయండి..
View this post on Instagram
Also Read: AP Crime: కృష్ణా జిల్లాలో విషాదం.. దంపతులు సహా కుమారుడి బలవన్మరణం..
Viral News: కూతురితో కలిసి ఎడారిలో సేద తీరుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి..