AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? అలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే తప్పక షాకవుతారు!

రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యే. అది సాధారణ అలసట లక్షణం అనుకుంటే పొరపాటే! కొందరికి ఒక్కోసారైతే, మరికొందరికి తరచుగా వస్తుంది. అయితే, కార్డియాలజిస్టులు ఈ సమస్య గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. అర్ధరాత్రి మెలకువ ..

ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? అలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే తప్పక షాకవుతారు!
Wake Up
Nikhil
|

Updated on: Dec 10, 2025 | 10:39 AM

Share

రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యే. అది సాధారణ అలసట లక్షణం అనుకుంటే పొరపాటే! కొందరికి ఒక్కోసారైతే, మరికొందరికి తరచుగా వస్తుంది. అయితే, కార్డియాలజిస్టులు ఈ సమస్య గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు.

అర్ధరాత్రి మెలకువ రావడం అనేది కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాదు, ఇది గుండె జబ్బులకు దారితీసే ఒక స్పష్టమైన సంకేతం కావచ్చు అంటున్నారు. నిద్ర , గుండె ఆరోగ్యం మధ్య ఉన్న ఈ కీలక సంబంధం ఏమిటి? ఆక్సిజన్ కొరత, ఒత్తిడి హార్మోన్ల విడుదలతో నిద్రలోనే మీ గుండె ఎంతటి పోరాటం చేస్తోంది?

గుండెపోటు ప్రమాదం..

  • సాధారణంగా నిద్రలో మన గుండె వేగం, రక్తపోటు తగ్గుతాయి. కానీ, అధిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారిలో, నిద్ర మధ్యలో ఒత్తిడి హార్మోన్లు.. ముఖ్యంగా కార్టిసాల్ విడుదలవుతాయి. ఈ కార్టిసాల్ విడుదల వల్ల గుండె వేగం పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది. ఈ మార్పులు మెదడును అప్రమత్తం చేసి, నిద్ర మధ్యలో మెలకువ వచ్చేలా చేస్తాయి. గుండెపై నిరంతరం ఈ ఒత్తిడి ఉండటం వల్ల, దీర్ఘకాలంలో గుండె జబ్బులకు దారితీయవచ్చు.
  •  నిద్ర మధ్యలో ఆగిపోయే లేదా తగ్గిపోయే శ్వాస సమస్య స్లీప్ అప్నియా గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. స్లీప్ అప్నియా ఉన్నప్పుడు, మెదడుకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. దీనివల్ల మెదడు శరీరాన్ని నిద్ర నుంచి లేవమని బలవంతం చేస్తుంది. స్లీప్ అప్నియాకు గురైన వారిలో రక్తపోటు పెరుగుతుంది, ఇది గుండె వైఫల్యం, పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది. తరచుగా మెలకువ రావడం దీనికి ప్రధాన లక్షణం.
  •  నిద్ర లేమి, నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక వాపు పెరుగుతుంది. ఈ వాపు రక్త నాళాలను దెబ్బతీసి, ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది నేరుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  •  ఎప్పుడైనా నిద్ర మధ్యలో మెలకువ వచ్చి, మళ్లీ పడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. సరైన నిద్ర ఉండేలా చూసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అర్ధరాత్రి వచ్చే మెలకువను అజాగ్రత్తగా తీసుకోవద్దు. ఇది కేవలం అలసటకు మాత్రమే కాక, మీ గుండె ఆరోగ్యానికి కూడా సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ గుండెను కాపాడుకోండి. NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.