గ్రీన్ టీ వీరికి విషంతో సమానం.. తాగితే నేరుగా కైలాసానికే!
08 December 2025
TV9 Telugu
TV9 Telugu
తెల్లారగానే తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాఫీ, టీ ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని భావిస్తాం
TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టంగా తాగే పానీయం టీ. ఇది ఎన్నో రుచుల్లో లభ్యం అవుతోంది. టీలలో గ్రీన్ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి
TV9 Telugu
ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు మళ్లిన వారు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. ధుమేహులు, అధిక రక్తపోటున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది
TV9 Telugu
బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఉన్నవారికి మేలు చేస్తుంది. వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత తాగితే మరీ మంచిది. దులో ఎలాంటి విష, అనారోగ్య కారకాలు అసలే లేవు
TV9 Telugu
గ్రీన్ టీ లో మెండుగా ఉండే రెసిపెరిట్రాల్ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అయితే గ్రీన్ టీ అందరికీ మంచిది కాదు
TV9 Telugu
ముఖ్యంగా ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగకూడదు. గ్రీన్ టీలోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కెఫిన్ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది
TV9 Telugu
అందుకే గుండె జబ్బులు ఉన్నవారు గ్రీన్ టీ వినియోగాన్ని తగ్గించాలి. గ్రీన్ టీ రక్తపోటును కొద్దిగా పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు గ్రీన్ టీ తక్కువగా తాగాలి
TV9 Telugu
గ్రీన్ టీలోని కెఫిన్ గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పిండం పెరుగుదలను ప్రతికూలంగా పని చేస్తుంది. అలాగే అసిడిటీ, అల్సర్ లేదా కడుపు నొప్పి ఉన్నవారు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. ఇందులోని కెఫిన్ కొంతమందిలో మైగ్రేన్ నొప్పిని పెంచుతుంది