Chicken: చికెన్‌తో పెరుగు తింటున్నారా.? చాలా డేంజర్.. కడుపు బ్లాస్ట్ అవ్వడం ఖాయం.!

పెరుగు చల్లటి, పుల్లటి స్వభావాన్ని కలిగి ఉండగా, చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. ఈ విరుద్ధ గుణాలున్న రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అజీర్ణం, కడుపునొప్పి, గుండెల్లో మంట వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ వివరాలు ఇలా..

Chicken: చికెన్‌తో పెరుగు తింటున్నారా.? చాలా డేంజర్.. కడుపు బ్లాస్ట్ అవ్వడం ఖాయం.!
Chicken & Curd

Updated on: Jan 27, 2026 | 4:30 PM

చికెన్, పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. పెరుగు చల్లదనాన్ని, చికెన్ వేడిని కలిగి ఉంటాయి. ఈ రెండింటి కలయిక అజీర్ణం, కడుపునొప్పి, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే చర్మ సమస్యలు, అధిక బరువుకు కారణం కావచ్చు. పిల్లలకు ఇది మరింత ప్రమాదకరం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఇష్టంగా చికెన్ తింటారు. రుచి కోసం లేదా కూర చిక్కగా ఉండడం కోసం కొందరు చికెన్‌లో పెరుగు కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

పెరుగు చల్లటి, పుల్లటి స్వభావాన్ని కలిగి ఉండగా, చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. ఈ విరుద్ధ గుణాలున్న రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అజీర్ణం, కడుపునొప్పి, గుండెల్లో మంట వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉంది. పెరుగులోని యాసిడ్స్ చికెన్‌లోని ప్రోటీన్‌తో కలిసి విరోచనాలు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకూ దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కలయిక చిన్నపిల్లలకు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. జీర్ణ సమస్యలే కాకుండా, చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీ వంటి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొంతమందిలో అధిక బరువు, వాతం వంటి ఆరోగ్య సమస్యలకూ ఇది కారణం కావచ్చు. వీలైనంత వరకు చికెన్‌లో పెరుగు కలపకుండా ఉండటమే మంచిది. ఒకవేళ కలపాల్సి వస్తే, పెరుగు ఎక్కువ పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే, మ్యారినేషన్ సమయాన్ని చాలా తక్కువగా ఉంచాలని సూచిస్తున్నారు.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.