Stress: ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్‌తో 5 నిమిషాల్లో ఒత్తిడి దూరం! ఒకసారి ట్రై చేయండి

ఆఫీస్ ఒత్తిడి, ట్రాఫిక్ టెన్షన్, ఇంట్లో పిల్లల గొడవలు, ఫోన్ నోటిఫికేషన్స్… ఇలాంటి వరుస పనులతో ఒక్కోసారి బుర్ర గిర్రున తిరుగుతుంది. చిరాకు, విసుగుతో ఏ పనీ చేయాలనిపించదు. కొన్నిసార్లైతే ఏది కనపడితే అది విసరాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు కొందరు ..

Stress: ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్‌తో 5 నిమిషాల్లో ఒత్తిడి దూరం! ఒకసారి ట్రై చేయండి
Breathiing Technique

Updated on: Dec 05, 2025 | 8:14 AM

ఆఫీస్ ఒత్తిడి, ట్రాఫిక్ టెన్షన్, ఇంట్లో పిల్లల గొడవలు, ఫోన్ నోటిఫికేషన్స్… ఇలాంటి వరుస పనులతో ఒక్కోసారి బుర్ర గిర్రున తిరుగుతుంది. చిరాకు, విసుగుతో ఏ పనీ చేయాలనిపించదు. కొన్నిసార్లైతే ఏది కనపడితే అది విసరాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు కొందరు టీ తాగడం, సోషల్ మీడియాలో ఫన్నీ రీల్స్ చూడటం చేస్తుంటారు. అయితే అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయంటున్నారు నిపుణులు.

మనసు ఒత్తిడికి గురైనప్పుడు ఒక్క 5 నిమిషాల శ్వాస వ్యాయామం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ను 23% వరకు తగ్గించి, మనసును పూర్తి రిలాక్స్ చేస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్ పేరు 4-7-8 బ్రీతింగ్. హార్వర్డ్ డాక్టర్ ఆండ్రూ వీల్ రూపొందించిన ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా చేయొచ్చు. ఒత్తిడిని తగ్గించే ఈ టెక్నిక్​ ఏంటో మనమూ తెలుసుకుందాం..

ఎలా చేయాలి..

ఏదైనా సౌకర్యవంతమైన పొజిషన్‌లో కూర్చోని లేదా పడుకుని కళ్లు మూసుకోవాలి. నాలుక ముందు పై పళ్ల వెనుక భాగాన్ని తాకేలా ఉంచాలి. ఇది గాలి విడుదలకు సహాయపడుతుంది. నోటి ద్వారా పూర్తిగా గాలి వదలాలి. నోటిని మూసి, ముక్కుతో నెమ్మదిగా 4 సెకన్లు గాలి పీల్చాలి. గాలిని లోపల 7 సెకన్లు పట్టి ఉంచాలి. నోటి ద్వారా “హూ…” అని శబ్దం చేస్తూ 8 సెకన్లు గట్టిగా గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు తగినంత ఆక్సీజన్​ అంది ఒత్తిడి తగ్గుతుంది. మొదట్లో నాలుగు రౌండ్స్​ చేస్తూ అలవాటు అయ్యాక 8 రౌండ్స్​ వరకు పెంచాలి.

ఈ శ్వాస విధానం మన శరీరంలో ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ రెస్పాన్స్‌ను నియంత్రించే సింపథటిక్ నరాలను ఆఫ్ చేసి, పారాసింపథటిక్ నరాలను రెస్ట్ & డైజెస్ట్ మోడ్ ఆన్ చేస్తుంది. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది, మనస్సు శాంతిస్తుంది. ఉదయం లేవగానే ఇలా చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు చేస్తే మంచి నిద్ర పడుతుంది.

పీరియడ్​ క్రాంప్స్​, తలనొప్పి వచ్చినప్పుడు కూడా చేయవచ్చు. 2018 జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ ప్రకారం 6 వారాలు రోజుకు 2 సార్లు చేస్తే యాంగ్జైటీ 40% తగ్గుతుంది. నిద్రలేమి ఉన్నవారిలో 80% మంది 4-7-8 వల్ల 10 నిమిషాల్లోనే నిద్రపోయారట. ఎటువంటి ఖర్చు లేని, 5 నిమిషాల్లోనే మనసును శాంతింపజేసే మంచి వ్యాయామం ఇది. ఇవాళ్టి నుంచే మొదలుపెట్టండి!