Health Tips: స్వీట్ కార్న్, దేశీ కార్న్.. ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా.. షాకింగ్ విషయాలు మీకోసం..

Health Tips: వర్షం, మొక్కజొన్న మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మందికి మొక్కజొన్న తినాలనే కోరిక ఉంటుంది. ఈ సీజన్‌లో.. నిమ్మరసం, ఉప్పు, కారం..

Health Tips: స్వీట్ కార్న్, దేశీ కార్న్.. ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా.. షాకింగ్ విషయాలు మీకోసం..
Corn
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 8:06 PM

Health Tips: వర్షం, మొక్కజొన్న మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మందికి మొక్కజొన్న తినాలనే కోరిక ఉంటుంది. ఈ సీజన్‌లో.. నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి వేడి వేడి మొక్కజొన్న కంకులను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే, కాల్చిన మొక్కజొన్నను ఇష్టపడని వారు స్వీట్ కార్న్‌ని ఎంచుకుంటారు. స్వీట్ కార్న్, దేశీ కార్న్ రెండూ వాటి స్వంత రుచిని కలిగి ఉంటాయి. కానీ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం.. రెండూ ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణింపబడుతాయి.

మొక్కజొన్న ఇతర తృణధాన్యాల మాదిరిగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో ఎరుపు, నారింజ, తెలుపు, ఊదా, నలుపు వంటి విభిన్న రంగులలో ఇవి లభిస్తాయి. అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. 100 గ్రాముల ఉడికించిన మొక్కజొన్నలో 96 శాతం కేలరీలు, 73 నీరు. పిండి పదార్థాలు 21 గ్రాములు, ప్రోటీన్ 3.4 గ్రాములు, ఫైబర్ 2.4 గ్రాములు, కొవ్వు 1.5 గ్రాములు ఉంటాయి. మొక్కజొన్న ప్రధానంగా పిండి పదార్ధాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. స్వీట్ కార్న్‌లో చక్కెర కంటెంట్ ఉన్నప్పటికీ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి.

స్వీట్ కార్న్, దేశీ కార్న్ మధ్య తేడా ఏమిటి?.. మొక్కజొన్నలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ మీరు ఉడికించే విధానం పోషక విలువను ప్రభావితం చేస్తుంది. ఇటీవల, డైటీషియన్ మున్మున్ గనేరివాల్ ఈ రెండింటిలో ఏది ఎక్కవ ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుందో వివరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తీపి మొక్కజొన్న ఒక హైబ్రిడ్ విత్తనం. ఇందులో ఇతర పోషకాల కంటే ఎక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఇది కాకుండా, ఫైబర్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు, దేశీ కార్న్‌లో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న చక్కెర కాంప్లెక్స్ స్టార్చ్‌గా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి పెరగదు. కాబట్టి, స్వీట్ కార్న్ కంటే దేశీ కార్న్ చాలా మంచిది.

మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ స్క్రీన్‌ల నుండి నీలిరంగు కాంతి వలన కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి మీ కళ్ళను రక్షించడానికి లుటిన్ సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫోలేట్ పిల్లల మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది.

ఎక్కువగా తింటే నష్టాలు తప్పదు.. ఏదైనా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అవి పోషకమైన ఆహారం అయినప్పటికీ. ఎందుకంటే అధికంగా తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మొక్కజొన్నలో కొంత మొత్తంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇనుము, జింక్ వంటి ఖనిజాలను శోషించడాన్ని నిరోధిస్తుంది. ఒక రోజులో మొక్కజొన్నను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకానికి కూడా దారితీస్తుంది.

Also read: Apps for Farmers: ఈ మొబైల్ యాప్‌లతో రైతులకు ఎంతో మేలు.. ఇవి తెలిపే సమాచారం ద్వారానే రైతులకు..

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!